newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఏపీ సర్కార్ నవశకం.. ప్రతివ్యక్తికి ఓ కార్డు

01-12-201901-12-2019 13:05:44 IST
Updated On 02-12-2019 14:24:17 ISTUpdated On 02-12-20192019-12-01T07:35:44.819Z01-12-2019 2019-12-01T07:35:37.458Z - 2019-12-02T08:54:17.636Z - 02-12-2019

ఏపీ సర్కార్ నవశకం.. ప్రతివ్యక్తికి ఓ కార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సర్కార్ ఇప్పటివరకు అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, ఆరోగ్యశ్రీలో మార్పులు, కాలేజీ విద్యార్థులకు ఇరవై వేలు, క్యాబ్ డ్రైవర్లకు పదివేలుతో పాటు సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మిగతా నవరత్నాలను కూడా అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే వీటిలో లబ్ధిదారులకు అర్హతలలో మాత్రం విధివిధానాలను ఆ పార్టీ నేతలే ఖరారు చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

నవరత్నాల సంగతెలా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం నవశకం పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి.. ప్రభుత్వ పథకం అర్హత సాధించిన ప్రతివ్యక్తికి ఓ కార్డు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం కాగా గరిష్టంగా మొత్తం ఈ కార్యక్రమంలో తొమ్మిది కార్డులు ఉంటాయి. మొత్తం తొమ్మిది కార్డులు పొందే కుటుంబం ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఓ విప్లవంలా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కార్డుల మేళాలో జనవరి పదవ తేదీలోపు కార్డులు ప్రజలకు చేరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. సరిగా ఈ కార్డులు ప్రజలకు చేరగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. కార్డులైతే వస్తాయి కానీ అర్హత సాధించిన వారికి లబ్ది మాత్రం ఎన్నికల తర్వాతే వచ్చేలా ప్లాన్ చేసినట్లుగా వినిపిస్తుంది.

అంటే కార్డులు దక్కించుకున్న వారంతా సమగ్రంగా స్థానిక నేతలకు అందుబాటులో ఉంటారు కనుక పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీకి ఓట్లేసిన వాళ్ళకే తర్వాత కార్డుల ద్వారా లబ్ది చేకూరనుంది. అందుకే కార్డుల జారీని ఉరుకుల పరుగుల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలు, కలెక్టర్లను తొందరపెడుతున్నారు. కలెక్టర్లు రెవెన్యూ శాఖను, వలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు.

అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు కూడా సాధారణ ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ, క్యాబ్ డ్రైవర్లకు నగదు వంటి పథకాలను కూడా హడావుడిగానే మొదలుపెట్టారు. ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు ఆ పథకాలను అమలు చేసినా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అయన సొంత సొమ్ము ఏమైనా ఇచ్చారా అంటూ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేశారు.

అలానే జగన్ ఆరునెలల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రంలో పరిస్థితులు వంటివి మాత్రమే పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఆ పార్టీకి గెలుపు, ఓటములు నిర్ణయిస్తుంది కానీ ఈ కార్డులు ఏ మాత్రం ఓట్లను తెచ్చే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ సర్కార్ తెస్తున్న ఈ కొత్త కార్డులు మరి ఎంతవరకు స్థానిక సమరంలో ఓట్లను కొల్లగొట్టనున్నాయో చూడాల్సి ఉంది.

 

 

 

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   2 minutes ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   25 minutes ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   an hour ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   an hour ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   an hour ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   3 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   3 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   3 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   3 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle