newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఏపీ రాజ‌కీయాల్లో బిగ్ ట్విస్ట్‌.. వైసీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఆ నేత‌కే..!

25-09-201925-09-2019 08:52:21 IST
Updated On 25-09-2019 12:21:28 ISTUpdated On 25-09-20192019-09-25T03:22:21.905Z25-09-2019 2019-09-25T03:22:15.223Z - 2019-09-25T06:51:28.597Z - 25-09-2019

ఏపీ రాజ‌కీయాల్లో బిగ్ ట్విస్ట్‌.. వైసీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఆ నేత‌కే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో స‌రికొత్త మాట వినిపిస్తుంది. కాగా, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కీల‌క స‌మావేశాలు, స‌మీక్ష‌ల‌తో నిత్యం బిజీ.. బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేరుస్తూ వ‌స్తున్న జ‌గ‌న్ మ‌రోవైపు కొత్త కొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

ఇలా సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్‌కు తీరిక‌లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ప‌నులను ద‌గ్గ‌రుండి చూసుకునేందుకు ఓ నేత ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా..? ఆ నేత ఎంట్రీతో వైసీపీలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా..?  అంటే అవున‌నే సంకేతాలు రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉంటున్నారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉద్యోగం, విద్య‌, ఉపాధి, పింఛ‌న్‌, రైతుల‌కు భ‌రోసా వంటివి ఇప్ప‌టికే కొన్నింటిని అమ‌లు చేశారు. మిగ‌తా విష‌యాలు అమ‌లు చేసేందుకు ప‌నిచేస్తున్నారు. ఇటు పార్టీ అధ్య‌క్షుడి హోదాలో..  అటు ముఖ్య‌మంత్రిగ‌గా జ‌గ‌న్ రెండు ప‌నులు చేయాలి. అందుకోసం పార్టీలో కొంత‌మేర ప‌నులను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారు. దాని కోసం జ‌గ‌న్ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియ‌మించ‌లేదు జ‌గ‌న్‌. అయితే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని ష‌ర్మిల‌కు ఇవ్వ‌బోతున్నార‌న్న వార్త‌లు వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, ష‌ర్మిల‌ గ‌తంలో పార్టీ కోసం చాలానే కృషి చేశారు. జ‌గ‌న్ జైలులో ఉండ‌గా పార్టీ అభివృద్ధి కోసం ప‌నిచేసింది. జ‌గ‌న్ కోసం పాద‌యాత్రా చేసింది. జ‌నాల్లోకి వెళ్లింది.

అలానే వైసీపీని గెలిపించేందుకు ష‌ర్మిల‌ చాలా వ‌ర‌కు కృషి చేసింది. దాంతో గ‌తంలో తెలంగాణ‌లో వైసీపీ ప్రెసిడెంట్‌గా నియ‌మిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఏపీకే పార్టీ ప‌రిమితం కావ‌డంతో అది సాధ్యం కాలేదు.  2014, 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ష‌ర్మిల స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. అప్ప‌టి టీడీపీ స‌ర్కార్‌పై పంచ్ డైలాగ్‌లు వేశారు.

జ‌గ‌న్ ఏపీ సీఎం అయిన త‌రువాత ఆమె ఏ ప‌ద‌వినీ ఆశించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే పార్టీ ప్లీన‌రీ నాటికి వైసీపీలో ఆమెకు కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇస్తార‌ని  కొంద‌రు, కీల‌క ప‌ద‌వి ఇస్తార‌ని మ‌రికొంద‌రు వాద‌న‌లు వినిపిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను ప‌ద‌వుల‌కు దూరంగా ఉంచే జ‌గ‌న్ ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటు ష‌ర్మిల కూడా తాను త‌న అన్న జ‌గ‌న్‌కు చేదోడు.. వాదోడుగా ఎన్నిక‌ల ప్ర‌చారం మాత్ర‌మే చేశాన‌ని, త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేదని గ‌తంలో చెప్పారు. డే టు డే రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని ఆమె గ‌తంలో చెప్పుకొచ్చారు. అయితే పార్టీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టేందుకు కుటుంబం నుంచి ఒక‌రుంటే బాగుండు అన్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ని, దాంతో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ష‌ర్మిల‌ను నియ‌మించే అవ‌కాశం మెండుగా ఉంద‌న్న ప్ర‌చారం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విస్తృతంగా కొన‌సాగుతోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle