newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఏపీ రాజకీయాల్లో వారసుల జోరు..!

25-10-201925-10-2019 09:17:35 IST
2019-10-25T03:47:35.842Z25-10-2019 2019-10-25T03:47:32.023Z - - 16-11-2019

ఏపీ రాజకీయాల్లో వారసుల జోరు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌లంతా ఫేడౌట్ అవుతున్నారు.. దీంతో వారి వార‌సులు పొలిటిక‌ల్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిలో కొంద‌రు తండ్రిచాటు రాజ‌కీయాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు ఏకంగా ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యులమంటూ దూసుకుపోతున్నారు. అయితే, ఈ న‌యా నేత‌ల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుందా..? త‌ండ్రుల‌ను ఆద‌రించిన‌ట్టుగానే త‌న‌యుల‌ను కూడా ఆద‌రిస్తారా..? అన్న‌దే ఇప్పుడు ఆయా రాజ‌కీయ కుటుంబాల్లో మెదులుతున్న ప్ర‌శ్న‌లు.

టీడీపీ నేత‌ల వార‌సుల విష‌యానికొస్తే.. చాపకింద నీరులా తండ్రుల‌ రాజ‌కీయ‌ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతుంటే వైసీపీ నేత‌ల వార‌సులు మాత్రం దూకుడుమీద ఉన్నారు. తండ్రుల‌తోపాటు అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొని పాల‌నా వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నారు. ఇప్ప‌టి నుంచే రాజ‌కీయాల‌ను వంట‌ప‌ట్టించుకునేందుకు పావులు క‌దుపుతున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రామ్ రాజ‌కీయ వార‌సుడిగా ఆయ‌న త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో అద్దంకి బ‌రి నుంచి త‌ప్పుకుని త‌న కుమారుడు వెంక‌టేష్‌కు టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు క‌ర‌ణం బ‌ల‌రామ్. దీంతో టీడీపీ టికెట్‌పై క‌ర‌ణం వెంక‌టేష్ పోటీచేసి ఓడిపోయారు.

అయితే, అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రామ్ తిరిగి తెర‌పైకి వ‌చ్చి చీరాల అసెంబ్లీ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందారు. దీంతో తండ్రి రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌పెట్టే ప‌నిలో త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్ ఉంటున్నారు. 2024 ఎన్నిక‌ల్లో తిరిగి క‌ర‌ణం వెంక‌టేష్ పోటీ చేసేందుకు ఇప్ప‌టి నుంచే రెడీ అవుతున్నారు.

మాజీ మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు వార‌సుడు సిద్ధా సుధీర్ రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో సిద్ధా సుధీర్ దర్శి రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర‌ను పోషించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ర్శి నుంచి పోటీ చేసేందుకు పొలిటిక‌ల్ ఫ్లాట్‌ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.

వైసీపీలో కూడా నేతల పుత్రులు వేగం పెంచారు. మంత్రి బాలినేని శ్రీ‌నివాసులురెడ్డి కుమారుడు ప్ర‌ణీత్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌ల పాల్గొంటున్నారు. తండ్రులు అధికారంలో ఉండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ ప‌నుల‌ను చ‌క్క‌బెడుతున్నారు. 

మ‌రోవైపు ఇటీవ‌లె అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి బాచిన చెంచు గ‌ర‌ట‌య్య‌ను ప‌క్క‌కు త‌ప్పించి ఆయ‌న కుమారుడు బాచిన కృష్ణ చైత‌న్య  వైపీపీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు ప‌రుచూరు నుంచి 2019 ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి ద‌గ్గుబాటి దంప‌తుల రాజ‌కీయ వార‌సుడు ద‌గ్గుబాటి హితేష్ చెంచురామ్ రాజ‌కీయ ఆరంగ్రేటం చేసుకునేందుకు అన్నీ సిద్ధం ఏసుకున్నా చివ‌రి నిమిషంలో అమెరికా పౌర‌స‌త్వం వ్య‌వ‌హారం అడ్డంకిగా మార‌డంతో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాలేక‌పోయారు.

అయితే తండ్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వెన్నంటే ఉంటూ నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్నారు. ఈ సారి తండ్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ప‌క్క‌న‌పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అభిమానులు చెప్పుకుంటున్నార‌ట‌.

కొడుకుల రాజ‌కీయ ప్ర‌వేశానికి తండ్రుల ప్రోత్సాహం కూడా ల‌భించ‌డంతో వారి వేగం ఊపందుకుంటోంది. అయితే ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌ల్లా తండ్రుల్లా కొడుకులు రాణిస్తారా..?  రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేస్తారా..?  వార‌సుల‌ను ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా..? అంద‌ల‌మెక్కిస్తారా..? అన్న‌ది ఇప్పుడు ఆయా రాజ‌కీయ కుటుంబాల్లో ఆందోళ‌న‌గా ఉంద‌ట‌. మ‌రి జ‌నం ఎవ‌రికి జై కొడ‌తారో వేచి చూడాలి. 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle