newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఏపీ రాజకీయాల్లో ‘లీకేజీ’ల లొల్లి

09-04-201909-04-2019 07:20:24 IST
Updated On 08-07-2019 12:37:58 ISTUpdated On 08-07-20192019-04-09T01:50:24.582Z09-04-2019 2019-04-09T01:50:19.566Z - 2019-07-08T07:07:58.345Z - 08-07-2019

ఏపీ రాజకీయాల్లో ‘లీకేజీ’ల లొల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్నవేళ ప్రధాన పార్టీలు విమర్శల వేడి పెంచాయి. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించేందుకు కొత్త దారులు తొక్కుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఆడియో, వీడియో లీక్‌లు చేస్తూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకరికి ఒకరు నష్టం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియా వేదికగా లీకైన ఆడియో, వీడియోలను వైరల్ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో రెండు పార్టీలూ ఉన్నాయి.

ఎన్నికలు వారం రోజులు ఉన్నాయనగానే ఈ లీకేజీల పర్వం మొదలైంది. ఆడియోలు, వీడియోలు అంటూ వైరల్ అవుతున్నాయి. ఇవి నిజమైనవా లేదా సాంకేతికతను ఉపయోగించుకొని దురుద్దేశ్యంతో సృష్టించినవో గానీ ముందుగా ఎన్నికల వేళ ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని పార్టీలు చూస్తున్నాయి. ఈ దశలో రెండు వర్గాలు దిగజారి రాజకీయాలు చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కుప్పం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఆడియో వైసీపీ వర్గాలు లీక్ చేశాయి. 40 నిమిషాలకు పైగా వ్యవధి ఉన్న ఈ ఆడియోను ఆ పార్టీ శ్రేణులు బాగా వైరల్ చేశాయి.

తర్వాత నందమూరి లక్ష్మీపార్వతి తనను వేధిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియోను బయటపెట్టారు. ఈ ఆడియో నిజమైనదా, నకిలీదో తెలియదు కానీ ఆమె పరువు తీసే ప్రయత్నం అయితే జరిగినట్లు కనిపిస్తోంది.

తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గ నేతలతో మాట్లాడుతున్న ఆడియోను వైసీపీ వర్గాలు వైరల్ చేశాయి. ఇందులో ప్రతిపక్ష పార్టీకి ప్రచారం చేసే వారిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని వైసీపీ ఈ ఆడియోను బాగానే ఉపయోగించుకున్నాయి. దీని తర్వాత ఓ మీడియా సంస్థ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆడియో అంటూ ఓ ఆడియో లీక్ చేసి దానిపై చర్చలు పెట్టి పెద్ద రచ్చే చేసింది.

తెలుగుదేశం పార్టీ అనుకూలురు ఈ ఆడియోను బాగా వైరల్ చేసుకున్నాయి. అయితే, ఆ గొంతు తనది కాదని విజయసాయిరెడ్డి ఖండించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు కూడా పెట్టారు. తాజాగా, ఈ లీకేజీల వ్యవహారం మరింత ముందుకెళ్లి ఏకంగా ఓ ఛానల్‌లో ఇంటర్వ్యూకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, సదరు ఛానల్ అధిపతి మాట్లాడుకుంటున్న వీడియో సంభాషణలు బయటకు వచ్చాయి.

ఇందులో చంద్రబాబు, ఛానల్ అధిపతి మాట్లాడుకుంటున్న పలు కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇది తమకు అనుకూలంగా ఉండటంతో వైసీపీ వర్గాలు దీనిని వైరల్ చేస్తున్నాయి. ఇలా, ఎన్నికల వేళ రెండు ప్రధాన పార్టీలూ ఇలా కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ఆడియోలు, వీడియోలు లీక్ చేసుకుంటూ గతంలో ఎన్నడూ లేనంత తారాస్థాయికి ఎన్నికల రాజకీయాన్ని తీసుకెళ్లాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle