newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా ఆమోదం

10-05-201910-05-2019 08:30:16 IST
Updated On 29-06-2019 12:26:32 ISTUpdated On 29-06-20192019-05-10T03:00:16.166Z10-05-2019 2019-05-10T02:58:35.064Z - 2019-06-29T06:56:32.653Z - 29-06-2019

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా ఆమోదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. గురువారం సాయంత్రం కిడారి శ్రవణ్ తన రాజీనామా పత్రాన్ని ఏపీ సీఎం కార్యాలయంలో అందచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బెంగాల్ పర్యటనలో ఉండడంతో, మంత్రి లోకేష్ చంద్రబాబుతో మాట్లాడి  శ్రవణ్ రాజీనామాను సీఎంఓలో అందచేశారు. 

11, నవంబర్ 2018లో కేబినేట్ మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణస్వీకారం చేశారు. సీఎంఓ అధికారులు మంత్రి రాజీనామా పత్రాన్నిహైదరాబాద్ లోని గవర్నర్ కార్యాలయానికి పంపించారు. రాజీనామా పత్రాన్ని పరిశీలించిన గవర్నర్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఆరునెలల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రవణ్ ఆరునెలల లోపు శాసనసభ/శాసనమండలిలో ఎక్కడా సభ్యుడు కాలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం రాజీనామా చేయాలని గవర్నర్ కోరడంతో, సీఎం చంద్రబాబు సూచన మేరకు శ్రవణ్ రాజీనామా చేశారు. టీడీపీ తనను తన సొంత కుటుంబంలో వ్యక్తిలా ఆదరించిందని, మంత్రిగా 6నెలల్లో ప్రజా సేవ చేశానని అన్నారు. గిరిజన అభివృద్ధికి, అరకు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, నిబంధనల ప్రకారం రాజీనామా చెయ్యాల్సి వచ్చిందన్నారు శ్రవణ్. 

ఈ ఆరునెలల కాలంలో మంత్రిగా తనకు అన్ని శాఖలు సహకరించాయని, సీఎం తనను ఎంతో ఆదరణతో చూశారని శ్రవణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు శ్రవణ్. మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్ కు శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో, ఆయన తనయుడు శ్రవణ్‌కు మంత్రిగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో శ్రవణ్ అరకు టీడీపీ అభ్యర్ధిగా పోటీచేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle