newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఏపీ మంత్రివర్గం కూర్పుపై భిన్నాభిప్రాయాలు

09-06-201909-06-2019 08:40:28 IST
Updated On 24-06-2019 13:24:48 ISTUpdated On 24-06-20192019-06-09T03:10:28.027Z09-06-2019 2019-06-09T03:10:20.776Z - 2019-06-24T07:54:48.946Z - 24-06-2019

ఏపీ మంత్రివర్గం కూర్పుపై భిన్నాభిప్రాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 25 మందిని తన టీంలోకి తీసుకున్నారు. అందులో ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అయితే ఐదుగురికి ఈ పదవులు ఇవ్వడం డిప్యూటీ సీఎం అనే పదాన్ని పరిహాసం చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది రాజ్యాంగబద్ధమయిన పదవి కాకపోవడమే కాదు. గతంలో ఒకరు డిప్యూటీ సీఎంగా ఉండేవారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనమంత్రివర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించుకున్నారు. కేఈ క‌ృ‌ష్ణమూర్తి,

నిమ్మకాయల చిన్నరాజప్ప డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వారిలో ఒకరిని రాయలసీమకు, మరొకరిని కోస్తా ప్రాంతానికి సమతూకంగా నిర్ణయించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ జగన్ సంగతికి వస్తే ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయపరిచింది. 

డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన ఐదుగురికైనా కీలక శాఖలు దక్కాయా అంటే అదీలేదు. ఆళ్ల నాని, అంజాద్‌ బాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. అయితే వీరికి దక్కిన శాఖలు గురించే చర్చ జరుగుతోంది.

వీరిలో ఆళ్ల నానికి వైద్య,ఆరోగ్యశాఖ, ఆంజాద్ బాషాకు మైనార్టీ సంక్షేమశాఖ, నారాయణస్వామికి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు రెవెన్యూ, పుష్ప శ్రీవాణికి గిరిజన సంక్షేమశాఖ కేటాయించారు. జగన్ తన వెంట ఉన్నవారు సీనియర్ నేతలకు మంత్రివర్గంలో స్థానం కేటాయించి, వారి ద్వారా పాలన సాగిస్తారని అంతా భావించారు. 

మంత్రివర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే మంత్రిమండలిలో బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లు తప్ప ఎక్కువమంది మంత్రులుగా పనిచేసినవారు లేకపోవడం గమనించాల్సిన అంశంగా చెప్పవచ్చు. ఏపీ మంత్రివర్గంలో దాదాపు 80 శాతంమంది కొత్తవారే ఉన్నారు.

వీరిలో పాలనలో అనుభవం లేదు. సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది కొత్త అనుభవమే. సీనియర్ ఐఎఎస్ అధికారులు, సలహాదారుల ద్వారా పాలన కొనసాగించే అవకాశం ఉంది. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

విధేయతకు ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో చోటు కల్పించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు జగన్. వైఎస్‌కు నమ్మిన బంటుల్లా ఉన్నవారు.. వైసీపీ స్థాపించిన తర్వాత తన వెంట నడిచి వచ్చినవారికి కూడా బెర్త్‌లు కేటాయించారు. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సమాచారశాఖ మంత్రిగా పని చేశారు పేర్ని కృష్ణమూర్తి.

ఆయన వారసుడిగా పేర్ని నాని తండ్రిలాగే సమాచారశాఖతో పాటు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జగన్ మంత్రివర్గంలో మంత్రులను నడిపించేది సీనియర్ ఐఎఎస్ అధికారులే. రెండున్నరేళ్ళ తర్వాత మంత్రులు మారతారని జగన్ ప్రకటించారు. ఈరెండున్నరేళ్ళలో తమ శాఖలపై పట్టుసంపాదించి ఈ కొత్త మంత్రులు ఎలా నిలదొక్కుకుంటారో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle