newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఏపీ బోటు ప్రమాదంపై సుప్రీం నోటీసు..

05-11-201905-11-2019 12:27:17 IST
Updated On 05-11-2019 15:39:22 ISTUpdated On 05-11-20192019-11-05T06:57:17.962Z05-11-2019 2019-11-05T06:57:01.680Z - 2019-11-05T10:09:22.578Z - 05-11-2019

ఏపీ బోటు ప్రమాదంపై సుప్రీం నోటీసు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గోదావరి నదిలో బోటు ప్రమాదం నేపథ్యంలో బోట్ల క్రమబద్ధీకరణను ఎలా అమలు చేస్తున్నారో తెలపాలంటూ సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి నోటీసు పంపి సంచలనం కలిగించింది. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నదీజలాల్లో బోటుప్రయాణానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాల రూపకల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజావ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బోట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి భారత ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

సెప్టెంబర్ 15న 77 మంది ప్రయాణీకులతో పాపికొండలు నుంచి భద్రాచలం వెళుతున్న రాయల్ వశిష్ట బోటు కచ్చులూరువద్ద సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మందిని గ్రామీణులు కాపాడారు. ప్రమాదం జరిగిన నెలరోజుల తర్వాత బోటును వెలికితీసినప్పుడు మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి.  

ఈ బోటు ప్రమాదంపై దాఖలైన ప్రజావ్యాజ్యంలో భారతప్రభుత్వానికి, కేంద్ర షిప్పింగ్, ఇన్ లాండ్ వాటర్‌వేస్ అధారిటీ ఆఫ్ ఇండియాకు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, అస్సామ్ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. 

ఏపీలోని నదీజలాల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం కమిటీలు వేయడం, ప్రతిపక్షాలు తమ వంతుగా విమర్శలు గుప్పించడం, ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విదిల్చడం తర్వాత కొన్నాళ్లకు ఆ ఘటననే అందరూ మర్చి పోవడం సాధారణమైన తంతుగా జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ దాఖలు చేసిన పీఐఎల్ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను కోర్టుకు లాగింది.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బోటు ప్రమాదాలు జరుగుతున్నాయని, అమూల్యమైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పదే పదే రుజువవుతున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా భావించకపోవడమే ప్రాణాలు బలిగొంటోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి బోటు ప్రమాదాన్ని సీరియస్‌గా పరిగణించి బోటు ఓనర్‌ కొడిగుండ్ల వెంకటరామన్‌పై కేసు పెట్టడమే కాకుండా అనుభవంలేని డ్రైవర్‌కు బోటును అప్పగించి ప్రమాదం జరగడానికి కారణమైన బోటు మేనేజర్లను అరెస్టు చేసింది. ప్రభుత్వ  సాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

మొత్తానికి విషయం సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో నదీజలాల్లో బోట్ రవాణా క్రమబద్ధీకరణపై కీలక నిర్ణయం జరగడానికి ఆస్కారముందని భావిస్తున్నారు.

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle