newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఏపీ బొగ్గు కొరతకు కేంద్రం, కేసీఆర్ సాయం తప్పదా?

30-09-201930-09-2019 13:02:09 IST
Updated On 30-09-2019 14:38:45 ISTUpdated On 30-09-20192019-09-30T07:32:09.104Z30-09-2019 2019-09-30T07:32:06.857Z - 2019-09-30T09:08:45.597Z - 30-09-2019

ఏపీ బొగ్గు కొరతకు కేంద్రం, కేసీఆర్ సాయం తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విపత్తు సమయంలో కేంద్రం, పొరుగు రాష్ట్రాల సహాయం ఎంత అవసరమో బొగ్గు తీవ్ర కొరత ద్వారా  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థమైంది. భారీ వర్షాలు, కార్మికుల సమ్మె కారణంగా  రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడంతో ఏపీ ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ఇప్పుడు 45 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే ఏపీకి చేరుతోంది.

దీంతో యుద్ధప్రాతిపదికన తమకు అదనపు బొగ్గును కేటాయించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అటు కేంద్రప్రభుత్వానికి, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం కోరారు. అలాగే బొగ్గు సరఫరా కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాశారు.

బొగ్గు సమస్య వల్ల ఇతర రాష్ట్రాలతోపాటు ఏపీకీ తీవ్ర సమస్య ఏర్పడింది.  జెన్ కో ద్వారా 3500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా బొగ్గు కొరతతో 1500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు, ఇతర సమస్యల వల్ల రోజు 75వేల మెట్రిక్ టన్నులకు గాను, 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే బొగ్గు వస్తోండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. మహానది నుంచి రావాల్సిన బొగ్గు ఆగిపోవడం వల్లనే ఆకస్మికంగా తీవ్ర సమస్య ఏర్పడింది. 

ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉత్పత్తిలో సమస్యల వలన సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయని..విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ట్రాన్స్‌కో  సీఎండీ శ్రీకాంత్‌ తెలిపారు. మంగళవారం నుండి పవర్‌ ఎక్సైంజ్‌ లో అదనంగా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. 

రాష్ట్రానికి బొగ్గు సరఫరా 57 శాతానికి పైగా తగ్గింది. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు కాగా, అందుకోసం మహానది కోల్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌) 17.968 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, సింగరేణి సంస్థ 8.88 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే భరత్‌పూర్‌లోని ఎంసీఎల్‌లో జూలై చివరి వారంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. 

దీంతో ఏపీ థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో భారీగా కొత పడింది. సింగరేణిలో కూడా వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆగస్టులో డొంకరాయి-సీలేరులో  పవర్‌ కెనాల్‌కు గండి పడింది.. అయితే భారీ వర్షాలతో పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడింది. తద్వారా బొగ్గు కొరత ఎదుర్కొవాల్సి వస్తోందని ఏపీజెన్‌కో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగినప్పటికీ అనుకోని అడ్డంకులతో విద్యుదుత్పత్తికి ఆటంకాలు ఏర్పడటం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచింది

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్న కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి అదనపు బొగ్గు సరఫరా సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ కేంద్రం త్వరగా స్పందించి అదనపు బొగ్గు కేటాయింపులు జరిగితే ఏపీలో విద్యుత్ ఉత్పత్తి గాడిలో పడుతుంది. విపత్తుల సందర్భాల్లోనే స్నేహం, పరస్పర సహకార భావనం ప్రాధాన్యత అర్థమవుతుంది అంటే ఇదేనేమో..

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle