newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు క‌న్నాకు రాజ్య‌స‌భ సీటు..?

23-11-201923-11-2019 09:40:33 IST
Updated On 23-11-2019 17:41:44 ISTUpdated On 23-11-20192019-11-23T04:10:33.469Z23-11-2019 2019-11-23T04:10:29.115Z - 2019-11-23T12:11:44.257Z - 23-11-2019

ఏపీ బీజేపీ అధ్యక్షుడు క‌న్నాకు రాజ్య‌స‌భ సీటు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీలో మార్పులు రాబోతున్నాయా..? అంటే అవున‌నే స‌మాధానం క‌మ‌ల నాథుల నుంచి వినిపిస్తోంది. కాగా, వ‌చ్చే నెల‌లో బీజేసీ సంస్థాగ‌త ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి. బీజేపీకి కొత్త అధ్య‌క్షుడు వ‌స్తాడు. ఆ త‌రువాత రాష్ట్రాల‌కు కూడా కొత్త సార‌ధులు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో భాగంగా ఏపీకి కూడా కొత్త అధ్య‌క్షుడు వ‌స్తాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను రాజ్య‌స‌భ‌కు పంపించి వ‌చ్చే నెల‌లో జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేంద్ర మంత్రిని చేస్తార‌ని ప్ర‌చారం నడుస్తుంది.

ఇలా క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కేంద్ర మంత్రిగా వెళితే ఆయ‌న స్థానంలో ఎవ‌రిని ఏపీ అధ్య‌క్షులుగా నియ‌మిస్తారు..? అన్న చ‌ర్చ కూడా వినిపిస్తోంది. అధ్య‌క్ష రేసులో బీజేపీలో చాలా మంది ఉన్న‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌ధానంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఇద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లె టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రితోపాటు బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డికి పగ్గాలు అప్ప‌గించ‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే, ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా యువ‌త‌కు అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంది..?  సీనియ‌ర్ల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి దిగువ స్థాయి నేత‌ల నుంచి అధిష్టానం అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఒక‌వేళ ఎంపీ స‌జ‌నా చౌద‌రికి కేంద్ర ప్ర‌భుత్వంలో బెర్త్ ల‌భిస్తే అధ్యక్షుడి రేసులో క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, విష్ణువర్ధ‌న్‌రెడ్డి మ‌ధ్య పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినేట్ బెర్త్ అంశంలో కానీ.. అటు ఏపీ బీజేపీ అధ్య‌క్ష రేసులో తీవ్ర పోటీ నెలకొంది. ఏదేమైనా ఏపీ బీజేపీలో మార్పులు మాత్రం ఖాయ‌మ‌న్న సంకేతాలు ఢిల్లీ అధిష్టానం నుంచి వినిపిస్తున్న మాట‌.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle