newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఏపీ బీజేపీలో నేతల తలోదారి.. సమన్వయం శూన్యమా?

22-10-201922-10-2019 14:13:25 IST
Updated On 22-10-2019 15:23:42 ISTUpdated On 22-10-20192019-10-22T08:43:25.311Z22-10-2019 2019-10-22T08:43:23.196Z - 2019-10-22T09:53:42.710Z - 22-10-2019

ఏపీ బీజేపీలో నేతల తలోదారి.. సమన్వయం శూన్యమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి?

నేతల మధ్య సమన్వయం కొరవడిందా?

అమిత్ షా ఆశలు నెరవేరతాయా?

టీడీపీతో పొత్తు విషయంలో ఎందుకీ గందరగోళం?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అంతగా ఫలితాలు అనుకూలించలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అంతకుముందు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే.. ఇప్పుడు కనీసం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలే కరువయ్యారు. రెండు ఎంపీ సీట్లు గతంలో గెలుచుకున్న బీజేపీకి అసలు ఎంపీలే లేకుండా పోయారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీ-టీడీపీ మధ్య అగాథం ఏర్పడింది. 

చంద్రబాబునాయుడు ఎన్డీయేనుంచి బయటకు రావడంతో ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండానే టీడీపీ బరిలోకి దిగింది. 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగింది. ఎంపీల విషయంలోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఒక్కో ఎంపీ చొప్పున ముగ్గురు గెలిచారు. శ్రీకాకుళంలో రామ్మోహననాయుడు, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ మాత్రం పార్లమెంటుకి వెళ్ళగలిగారు. ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులో మార్పు కనిపించిందని అంటున్నారు. 

ఎన్నికలు ముగిసి జగన్ సీఎం అయ్యాక నాలుగైదు నెలల తర్వాత ఆయన రియలైజ్ అయినట్టు కనిపించింది. బీజేపీతో పొత్తు విషయంలో తప్పుచేశానని ఆయన పశ్చాత్తాపపడ్డారు. బీజేపీతో కలవడానికి తాను సిద్ధమే అని కార్యకర్తలకు సంకేతాలు పంపారు. చంద్రబాబు ప్రకటనపై బీజేపీ నేతలు తలోరకంగా స్పందించారు. చంద్రబాబుకి డోర్లు మూసేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, సోము వీర్రాజు ప్రకటించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మరో ఎంపీ సుజనా చౌదరి మాత్రం చంద్రబాబు విలీనం గురించి లేఖ ఇస్తే అమిత్ షా తో చర్చిస్తానని చెబుతారు. ఇదంతా ఇలా ఉంటే టీడీపీని విలీనం చేస్తామంటే అధిష్టానంతో మాట్లాడతానని మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. 

కేవలం టీడీపీతో పొత్తు విషయంలోనే కాదు ఇటు కీలకమయిన అంశాల విషయంలో నేతల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. ఇటు రాజధాని అమరావతి, ఆంధ్రాప్రజల జీవనాడి అయిన పోలవరంపై భిన్నాభిప్రాయాలు కనిపించాయి. బీజేపీ నేతలు చేపట్టిన గాంధీ సంకల్పయాత్రలకు అక్కడక్కడా మంచి స్పందన లభిస్తోంది. జనం మధ్య తిరిగే నేతలు ఈ యాత్రల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు.

నిత్యం మీడియా ముందుకి వస్తూ.. అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చే నేతలకు అంతగా ఆదరణ ఉండదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు చీరాల గాంధీ సంకల్పయాత్రలో నిజమయింది. ఆయన జనానికి అంతగా తెలియదు.. ఆయనతో పాటు ప్రముఖ నేతలు ఎవరైనా నడిస్తే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.

మొత్తం మీద అనేక అంశాల్లో బీజేపీ కీలక నేతలు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేతల వలసలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీనమయిన వేళ బీజేపీ బలం పుంజుకోవడానికి పటిష్టమయిన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశమంతా మోడీ హవా నడుస్తున్నవేళ ఏపీలో నేతలంతా ఒకే మాటగా ముందుకి సాగితే బీజేపీ దూసుకెళ్లడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle