newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టారా..?

29-08-201929-08-2019 08:12:53 IST
2019-08-29T02:42:53.835Z29-08-2019 2019-08-29T02:27:19.359Z - - 27-02-2020

ఏపీ బీజేపీలో చిచ్చు పెట్టారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీలో ఇప్పుడు రాజ‌ధాని చిచ్చు మొద‌లైన‌ట్లు కనిపిస్తోంది. అమ‌రావ‌తి విష‌యంలో నెల‌కొన్న గంద‌ర‌గోళం కార‌ణంగా బీజేపీ నేత‌ల మ‌ధ్య చీలిక వ‌చ్చింది. పాత నేత‌లు, కొత్త నేత‌లు ఈ విష‌యంపై త‌లో ర‌కంగా స్పందిస్తున్నారు.

ఈ మ‌ధ్య బీజేపీలో జోష్ పెంచిన‌ కొత్త నేత‌లు రాజ‌ధాని వ్య‌వ‌హారంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంచుమించు తెలుగుదేశం పార్టీ లానే వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అయితే, ప‌లువురు పాత భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. రాజ‌ధానిపై నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూనే రాజ‌ధానిలో అక్ర‌మాలు, ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని చెబుతున్నారు.

వీరి వాద‌న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. దీంతో రాజ‌ధాని అంశం బీజేపీ నేత‌లు విభ‌జ‌న రేఖ గీసిన‌ట్లే ఉంది.

ఎన్నిక‌ల ముందు బీజేపీ నేత‌లు అప్ప‌టి తెలుగుదేశం పార్టీతో మాటల‌యుద్ధం చేశారు. రాజ‌ధానిలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ముఖ్యంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు, సీనియ‌ర్ నేత సోము వీర్రాజు వంటి వారు టీడీపీతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరాడారు. కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత వీరి స్పీడ్ త‌గ్గింది. కొత్త‌గా పార్టీలో చేరిన టీడీపీ నేత‌లు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ ఇప్పుడు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాజ‌ధాని విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై సుజ‌నా చౌద‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీవ్రంగా మండిప‌డుతున్నారు. రాజ‌ధానిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార‌నివ్వ‌మ‌ని స‌వాల్ చేస్తున్నారు.

సుజ‌నా చౌద‌రి అయితే ఇన్‌సైడ్  ట్రేడింగ్ జ‌రిగింద‌నే వైసీపీ ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం సుజ‌నా చౌద‌రికి మ‌ద్ద‌తుగా ఉంటున్నారు.

కానీ, పాత బీజేపీ నేత‌లు జీవీఎల్‌, సోము వీర్రాజు, ర‌ఘురామ్ మాత్రం సుజ‌నా చౌద‌రి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించ‌డం లేదు. రాజ‌ధానిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని, టీడీపీ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని ఇప్పుడు కూడా విమ‌ర్శిస్తున్నారు.

ఇవ‌న్నీ బ‌య‌ట‌కు తీసి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. జీవీఎల్ మాట్లాడుతూ.. రాజ‌ధాని మార్పు రాష్ట్ర ప్ర‌భుత్వ ఇష్ట‌మ‌ని, ఇప్ప‌టికే మార్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని, కాబ‌ట్టి గంద‌ర‌గోళానికి తెర‌దించి ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని కోరారు.

ఇది సుజ‌నా చౌద‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీసుకున్న స్టాండ్‌కు భిన్న‌మైన‌ది. జీవీఎల్‌, సోము వీర్రాజు, ర‌ఘురామ్ వ్యాఖ్య‌లు కొంత రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా, టీడీపీకి ఇబ్బందిక‌రంగా ఉన్నాయి. దీంతో రాజ‌ధాని వ్య‌వ‌హారం భార‌తీయ జ‌న‌తా పార్టీలో అంత‌ర్గ‌తంగా బేదాభిప్రాయాలు సృష్టించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle