newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

ఏపీ బీజేపీలో ‘ఇసుక’ తుపాను

01-11-201901-11-2019 16:31:46 IST
Updated On 01-11-2019 16:55:36 ISTUpdated On 01-11-20192019-11-01T11:01:46.100Z01-11-2019 2019-11-01T11:01:24.640Z - 2019-11-01T11:25:36.260Z - 01-11-2019

ఏపీ బీజేపీలో ‘ఇసుక’ తుపాను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ బీజేపీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రధాని మోడీ ఆదేశాలతో గాంధీ సంకల్పయాత్ర చేపట్టిన బీజేపీ నేతలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేక సతమతమవుతున్నారు. ఏపీలో ఇసుక దొరక్క జనం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

భవన నిర్మాణ కార్మికులు పనులు దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు టీడీపీ నిరాహారదీక్షలు, ఆందోళనలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా ఇసుక సమస్య బీజేపీ నేతల మధ్య సమన్వయలోపానికి కారణమవుతోంది.

ప్రజాసమస్యలపై ఎవరు పోరాటం చేసినా మేం మద్దతు ఇస్తాం అని గతంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత మీద ఆందోళనకు దిగారు.

ప్రభుత్వ అసమర్థత వైఖరితో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాడేందుకు నవంబర్ 3న విశాఖలో జనసేన "లాంగ్ మార్చ్" నిర్వహించనుంది. ఈ మార్చ్‌కు వేలాదిగా తరలిరావాలని, కార్మికులకు అండగా నిలవాలని పవన్ కోరిన సంగతి తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్ కు బీజేపీ మద్దతు తెలిపింది.

ఈ విషయంలో బీజేపీ నేతల మధ్య మనస్సర్థలు వచ్చాయి. అయితే, తాము పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోబోమన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు తాము బయట నుంచి మద్దతు ఇస్తామన్నారు. కన్నా హామీ ఇవ్వడంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి, చంద్రబాబునాయుడికి పవన్ కళ్యాణ్ తొత్తు అని ముందునుంచీ బీజేపీ విమర్శిస్తోందన్నారు.

ఆయనతో కలిసి ఉద్యమం చేయలేం.. మద్దతు ఇవ్వలేం అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇసుక లాంగ్ మార్చ్ అయిన వెంటనే తర్వాత రోజు బీజేపీ ఇలాంటి ఉద్యమానికి రెడీ అయింది. 

శుక్రవారం మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ ఇసుక కొరత విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో ఇసుక కొరత గురించి ఉద్యమం మొదలుపెట్టింది బీజేపీయే అన్నారు.

ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరతవలన కార్మికులు ఆకలి తో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. జనం గురించి ఆలోచించకుండా మంత్రులు...ప్రతిపక్షానికే ఇసుకకొరత సమస్యగా ఉందని మంత్రులు చెప్పడం విడ్డూరమన్నారు. 

గత ప్రభుత్వం  చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. విపక్ష పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అవసరం అయితే అంతా జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చామన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ఇసుక సత్యగ్రహం నవంబర్ 4 న ధర్నా చౌక్ లో జరుగుతుందన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ బీజేపీలో తుపాను రేపింది. ఆ తర్వాత రోజే బీజేపీ సత్యాగ్రహానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. 

 

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   12 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle