newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ఏపీ బీజేపీకి రథసారథి ఎవరు? రేసులో ఆ నలుగురు?

09-01-202009-01-2020 09:52:59 IST
Updated On 09-01-2020 10:47:35 ISTUpdated On 09-01-20202020-01-09T04:22:59.883Z09-01-2020 2020-01-09T04:22:49.102Z - 2020-01-09T05:17:35.486Z - 09-01-2020

ఏపీ బీజేపీకి రథసారథి ఎవరు? రేసులో ఆ నలుగురు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగియనుండడంతో ఈ నెలాఖరులోపు కొత్త సారథిని నియమించడానికి బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరికి ఇవ్వాలనేదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ గురి పెట్టింది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండడంతో ఈ మేరకు వ్యూహ రచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో కొంత పట్టు సాధిస్తే, 2024 సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వవచ్చనేది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఏపీ బీజేపీపై ఫోకస్ పెట్టారు. సమర్ధుడైన నేతను అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.  దేశంలో పార్టీ చేపట్టిన వివిధ సంస్కరణలను జనంలోకి తీసుకెళ్లడానికి అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర నేతలు కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. మరింత సమర్ధంగా బీజేపీ విధానాలను ఏపీలో గడపగడపకు తీసికెళ్లే నాయకత్వం కోసం అన్వేషణ సాగుతోంది. 

అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ప్రస్తుత అధ్యక్షుడు కన్నాతో పాటు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు వున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. దీంతో మరికొందరు ముఖ్య నేతలు, అధికార ప్రతినిధులు జాబితాలో వున్నట్టు తెలుస్తోంది.

ఈ రేసులో కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు ముందంజలో ఉన్నారు. ఎవరికివారు అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి అధ్యక్ష పదవికోసం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు.  మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరు గట్టిగా వినిపిస్తున్నా.. ఆయనకంటే ఎమ్మెల్సీ మాధవ్ , సోము వీర్రాజు బెటరంటున్నారు.

బీజేపీ అధిష్టానం ఆలోచన ఏంటనేది తెలియడం లేదు. ముఖ్యంగా పురందేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్, వీర్రాజు రేసులో ముందున్నారు. సుజనా చౌదరికి కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నా.. ఆయనకు మరోసారి కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని ఆవిధంగా ఆయన రేసులో లేనట్టేనంటున్నారు. మొత్తం మీద బీజేపీ అధిష్టానం ఎవరికి సారథి బాధ్యతలు అప్పగిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle