newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఏపీ బాటలోనే తెలంగాణ.. మద్యం షాపులు, రిజిస్ట్రేషన్లు

06-05-202006-05-2020 12:44:25 IST
Updated On 06-05-2020 12:58:04 ISTUpdated On 06-05-20202020-05-06T07:14:25.574Z06-05-2020 2020-05-06T07:12:53.902Z - 2020-05-06T07:28:04.416Z - 06-05-2020

ఏపీ బాటలోనే తెలంగాణ.. మద్యం షాపులు, రిజిస్ట్రేషన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిని ఒకరు ఫాలో అవుతుంటారు. తాజాగా సీఏం కేసీయార్ ఏపీ సీఎం జగన్ బాట పట్టారు.ఏపీలో మద్యం షాపులు తెరిచారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పనిచేశారు. అలాగే ఆగిపోయిన భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు రిజిస్ట్రేషన్ సేవలు ఏపీలో ప్రారంభం అయ్యాయి. ఇటు తెలంగాణలోనూ పచ్చజెండా ఊపారు. ఏపీలో మంగళవారం నాడు స్వల్పంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రిజిస్ట్రేషన్‌ సేవలు రావడంతో ఆదాయం ప్రారంభం అయింది.

గ్రీన్ జోన్ లలో 108 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ తరువాత తొలిరోజు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం లభించింది. మంగళవారం మొత్తం 633 డాక్యుమెంట్ లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మార్చి 23 నుంచి నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్లు. ఆంక్షల‌ సడలింపుతో కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల వున్న‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. 

కరోనా వైరస్ నివారణ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌ఓ), జిల్లా రిజిస్ట్రార్‌ (డీఆర్‌), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ఆఫీసుల్లో అందుబాటులో సాధారణ సేవలు లభిస్తున్నాయి. కరోనా నియంత్రణ లో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భౌతిక దూరం ఆంక్షలు అమలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ కా ర్యాలయాల సిబ్బంది, సేవల కోసం వచ్చే వారికి మాస్కులు తప్పనిసరి చేశారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అవసరమైతే టోకెన్లు జారీ చేయాలని భావిస్తున్నారు.  

పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ) దస్తావేజులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎందుకంటే డాక్యుమెంట్లు ముందే రెడీ చేసుకుని రావడం వల్ల సమయం ఆదా అవుతుంది. బయోమెట్రిక్‌ యంత్రాలను వినియోగించిన ప్రతిసారీ శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది. వేలిముద్రలు, స్టాంపు పేపర్లు తీసుకునేప్పుడు, ఆ తరువాత కూడా చేతులు శానిటైజ్ చేస్తున్నామని ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ అండ్ ఐజి సిద్దార్ధజైన్ తెలిపారు. 

ఇటు తెలంగాణలోనూ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను శుభ్రం చేయడం, అక్కడ సోషల్ డిస్టెన్స్, శానిటైజర్లు, మాస్కులు ధరించాలని సీఎం సూచించారు.. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో కార్యకలాపాలు కొనసాగుతాయి. రాష్ట్రానికి ఆదాయం తెస్తుంది కాబట్టి వందశాతం పనిచేస్తుందన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతధంగా చేసుకోవచ్చు. కాకపోతే భౌతికదూరం పాటించాలి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, సంబంధిత అధికారులు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలె. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను పాటిస్తూ.. మద్యం అమ్మకాలు సాగించేందుకే సర్కారు అవకాశం ఇచ్చింది. అయితే ఏపీలో అక్కడకక్కడా నిబంధనలు ఉల్లంఘించారు. ఏపీలో జగన్  మద్యం ధరలు భారీగా పెంచితే.. కేసీయార్ కూడా స్వల్పంగా పెంచారు. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle