newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో గుడ్ న్యూస్‌..!

21-12-201921-12-2019 13:04:19 IST
2019-12-21T07:34:19.336Z21-12-2019 2019-12-21T07:34:15.316Z - - 15-08-2020

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో గుడ్ న్యూస్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టికే ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసిన ఏపీ ప్ర‌భుత్వం పండుగ వేళ మ‌రో గుడ్‌న్యూస్ అందించింది. కార్మికుల‌కు సంక్రాంతిపండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు నిధులు మంజూరు చేస్తూ కీలక‌ నిర్ణ‌యం తీసుకుంది.

అడ్వాన్స్ కోసం రూ.19 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే నెల 1న డిసెంబ‌ర్ వేత‌నంతో క‌లిపి అడ్వాన్స్ చెల్లించాల‌ని ఆర్టీసీ కృష్ణ‌బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. కేట‌గిరిల వారీగా అడ్వాన్స్ మొత్తం అందించ‌నున్నారు. క్లాజ్ 3 కేట‌గిరి ఉద్యోగుల‌కు రూ.4,500లు, క్లాజ్ 4 కేట‌గిరి ఉద్యోగుల‌కు రూ.4వేలు అడ్వాన్స్‌గా ఇవ్వ‌నున్నారు.

పండుగ స‌మ‌యంలో ఇచ్చిన అడ్వాన్స్‌ను ఉద్యోగుల వేత‌నాల నుంచి ప‌ది నెల‌ల్లో ప్ర‌భుత్వం రిక‌వ‌రీ చేయ‌నుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆర్టీసీ కార్మికుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తాన‌న్న ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేసింది.

కాగా, మిగిలిన ప్ర‌క్రియ‌కు గ‌తంలోనే రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలుప‌గా జ‌న‌వ‌రి నుంచి ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగుల‌గా ప్ర‌క‌టిస్తూ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు ఇప్ప‌టికే ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. దీంతో సంస్థ‌లో ప‌నిస్తున్న 52వేల మంది ఉద్యోగులు జ‌న‌వ‌రి 1 నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగులేన‌ని ప్ర‌క‌టించారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle