newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

ఏపీ ప్రజలను కలవరపెడుతున్న కలల రాజధాని!

26-10-201926-10-2019 11:21:40 IST
Updated On 26-10-2019 17:43:40 ISTUpdated On 26-10-20192019-10-26T05:51:40.750Z26-10-2019 2019-10-26T05:51:35.660Z - 2019-10-26T12:13:40.983Z - 26-10-2019

ఏపీ ప్రజలను కలవరపెడుతున్న కలల రాజధాని!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ కలల రాజధానిగా అమరావతే ఉంటుందా? అమరావతి అనే నామం చరిత్రగా మారుతుందా? వైసీపీ సర్కార్ అమరావతి నుండి రాజధానిని తరలిస్తుందా? మరోచోటకి మారుస్తుందా? జగన్ ప్రభుత్వం క్యాపిటల్ కోసం నియమించిన కమిటీ మనసులో మాటేంటి? ఆ ప్రభుత్వంలోని మంత్రుల 'అందుబాటులో ఉండే చోటే రాజధాని' మాటల అర్థమేంటి? అసలు సర్కార్ రాజధానిపై ఇచ్చే క్లారిటీ ఏంటి? ఇవే ఇప్పుడు ఏపీ ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు.

ఏపీ రాజధాని కోసం గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం దాదాపు 33 వేల ఎకరాల భూములను సేకరించింది. దీనికి రాజధాని చుట్టుపక్కల ఉన్న భూములను కలుపుకుంటే దాదాపు యాభై వేల ఎకరాలు రాజధాని పరిధిలో భూమి సమకూరింది. ఆంధ్రుల వారసత్వంతో పాటు ట్రెడిషన్ ను కలిసి అమరావతిగా రాజధానికి నామకరణం జరిగిపోయింది. అక్కడ నుండి ప్రపంచ నగరంగా అమరావతిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు అదే స్థాయిలో కలలు కని ప్రజలను కలలలోకి తీసుకెళ్లారు.

కలలకు తగ్గట్లే సింగపూర్ ప్రభుత్వం, ప్రతినిధుల నుండి రాజధాని కోసం నమూనాలను సేకరించి త్రీడీలో వీడియోలు విడుదల చేశారు. మన రాజధాని ఇలా ఉండబోతుందా అని ప్రజలు విశ్వనగరంపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లే మౌలిక వసతులతో కూడిన నిర్మాణాలకు శంకుస్థాపనలు మొదలయ్యాయి. కనిష్టంగా ఇరవై ఐదు శాతం నుండి గరిష్టంగా డెబ్భై ఐదు శాతం వరకు ప్రధాన నిర్మాణాలు ఆ ప్రభుత్వ హయంలోనే జరిగిపోయాయి.

అదంతా గతం రాష్ట్రంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యమేలుతుంది. ముందునుండి రాజధాని మీద స్పష్టమైన వైఖరి లేని వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అదే అస్పష్టత ప్రదర్శిస్తుంది. హైకోర్టు తరలింపుపై మూడు ప్రాంతాలు ఆందోళనకు దిగినా కిమ్మనకుండిపోయిన ప్రభుత్వం రాజధాని అమరావతి మీద కూడా ఎటూ తేల్చడం లేదు. రాజధాని రైతులకు కౌలు చెల్లించిన ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో మాత్రం ఒక్క ఇటుకను కదపలేదు.

ఎక్కడైనా భారీ వర్షాలొస్తే వరదలు రావడం సహజం. కానీ ఇక్కడ వరదలొస్తే అమరావతికి భూములిచ్చిన రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడ భూమి ఎక్కడ వెనక్కు తీసుకోమంటుందోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రజలది అదే పరిస్థితి. రాజధానంటే రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరులలో ఒకటిగా ఉండాలన్నది మేధావుల వాదన. అది అమరావతికి ఉందని నిర్మాణానికి ముందే పలు సందర్భాలలో నిరూపించుకుంది.

అమరావతి పూర్తయితే రాష్ట్రానికి ఓ రూపు కనిపిస్తుందని నమ్మిన వాళ్లంతా ప్రభుత్వం చర్యలకు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామన్న వైఎస్ జగన్ ప్రభుత్వంలోకొచ్చాక రాజధాని మాట ఎత్తిన పాపాన పోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మార్చబోమన్న వైసీపీ నేతలు ఇప్పడు కమిటీ చెప్పిందే వేదమని మాట్లాడడం అమరావతిపై నీలినీడలు కమ్ముకొచ్చాయి.

ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మించడం రాష్ట్రానికి ఆర్ధిక భారమన్న ప్రభుత్వ పెద్దలు రేపు కమిటీకి ఏ సూచనలిస్తారు? కమిటీ రాజధాని మార్పు తప్పదంటే అమరావతికి చెల్లిపోయినట్లేనా? గత ప్రభుత్వం రాజధాని కోసం పెట్టిన పదివేలకోట్ల మాటేమిటి? అమరావతిని కాదంటే రాష్ట్రంలో రాజధాని కోసం రగిలే కుంపటి మాటేమిటి? ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగు స్థానంలో ఉన్న రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికితే రాష్ట్ర పరిస్థితేంటి? రాష్ట్ర భవిష్యత్తుకు బాధ్యతెవరు? కొత్త ప్రభుత్వం కొత్త రాజధాని ఎంపిక కోసం పుణ్యకాలం పూర్తిచేస్తే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం దశాబ్దాలు గడవాల్సిందేనా? ప్రజలకు ఈ కలవరం తీరేదెప్పుడు? ఇది మా రాజధానని ఆంధ్ర ప్రజలు గర్వంగా చెప్పుకొనేదెన్నడు? అంతా భ్రాంతియేనా!

 

 

 

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   12 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle