newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

21-09-202021-09-2020 14:03:52 IST
Updated On 21-09-2020 15:42:29 ISTUpdated On 21-09-20202020-09-21T08:33:52.264Z21-09-2020 2020-09-21T08:33:48.117Z - 2020-09-21T10:12:29.424Z - 21-09-2020

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజలకు సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ఇప్పటి వరకూ ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ యాప్ ద్వారా అలాంటి కష్టాలకు చెక్ పెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ యాప్ లో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానించారు. 

ఏపీ పోలీస్ సేవ పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ యాప్ నుంచి ఫిర్యాదులు చేసే వెసులుబాటు ఉంది. అన్ని నేరాలపై ఈ యాప్ నుంచి ఫిర్యాదులు చేయగా.. సదరు ఫిర్యాదుకు సంబంధించిన రశీదు కూడా పొందవచ్చట. ముఖ్యంగా మహిళల కోసం 12 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వీడియో కాల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌకర్యం ఇందులో ఉంది. 

ఒక కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు, అరెస్ట్ లు, ఎఫ్ఐఆర్ లు, రికవరీలు, రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ లకు అనుమతులతో పాటు ఎన్ఓసీలు, లైసెన్సులు, పాస్ పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లన్నీ ఇందులో లభిస్తాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎంకు వివరించారు. వీటిటన్నింటితో పాటు ఎప్పటికప్పుడు మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని కూడా నిర్థారించుకునే సౌకర్యం ఏపీ పోలీస్ సేవ యాప్ లో ఉంది. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle