newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఏపీ పోలీస్ కొత్త బాస్ గౌతమ్ సవాంగ్ 1

31-05-201931-05-2019 07:37:30 IST
Updated On 25-06-2019 14:29:52 ISTUpdated On 25-06-20192019-05-31T02:07:30.311Z31-05-2019 2019-05-31T02:07:25.881Z - 2019-06-25T08:59:52.148Z - 25-06-2019

ఏపీ పోలీస్ కొత్త బాస్ గౌతమ్ సవాంగ్ 1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో పాలన గాడిలో పడుతోంది. గురువారం ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. అనేక మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసిన జగన్, ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను ఖరారు చేశారు. 

పాలనలో జగన్‌ కీలకమార్పులకు ఈవిధంగా శ్రీకారం చుట్టారు. ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవాంగ్‌ ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు.  ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీలో కమిషనర్‌గా ఉన్న త్రిపాఠిని జీఏడీకి బదిలీ చేశారు. 

మరోవైపు ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా స్థానచలనం కలిగింది. ఆయన్ను జీఏడీకి రిపోర్ట్‌ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వెంకటేశ్వరరావు స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయింది. ఏబీ వెంకటేశ్వరరావు పనితీరుపై ఎన్నికల సమయంలోనే వైసీపీ అసహనం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈసీ ద్వారా ఏబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయించింది.

ముక్కుసూటి మనిషిగా గౌతమ్ సవాంగ్ కు పేరుంది. ఐపీఎస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ ఏపీ కేడర్‌ అధికారి. ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినరోజే రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా పూర్తి అదనపు బాధ్యతలు సవాంగ్‌కు దక్కడం విశేషం. సవాంగ్‌ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఏపీ గ్రేహౌండ్స్‌ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా సేవలందించారు.

2000లో డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌ల్లో పనిచేశారు. ఏసీబీ, ఎస్‌ఐబీ వింగ్‌లో విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు.

2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేసి, తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో ఆయనకు డీజీగా పదోన్నతి వచ్చింది.

సవాంగ్‌ను డీజీపీగా నియమిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సవాంగ్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉంటాయంటున్నారు ఇతర అధికారులు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle