newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఏపీ పోలీసుల హ్యాపీ.. ఇవాళ్టినుంచే వీక్లీ ఆఫ్ అమలు

19-06-201919-06-2019 12:20:54 IST
2019-06-19T06:50:54.504Z19-06-2019 2019-06-19T06:50:52.888Z - - 20-09-2019

ఏపీ పోలీసుల హ్యాపీ.. ఇవాళ్టినుంచే వీక్లీ ఆఫ్ అమలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న రోజు ఇది. ఆంధ్రప్రదేశ్ లోని పోలీసులకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు.  రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారాంతపు సెలవుల విధానాన్ని ప్రభుత్వం బుధవారం నుంచి అమలు చేస్తోంది.  ఇకమీదట పోలీసులకు కూడా ప్రతివారం ఓ సెలవు ఉంటుందని పేర్కొంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసు విభాగం కొత్తగా వారంలో ఒకరోజు సెలవు విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఉత్తర్వులు జారీచేశారు. 

దీనిపై ఆయన పలు వివరాలు అందచేశారు. కానిస్టేబుల్ నుంచి సీఐ ర్యాంకు అధికారుల వరకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నట్టు చెప్పారు. పని ఒత్తిడితో పోలీసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వారాంతపు సెలవుతో పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వారాంతంలో వారి వ్యక్తిగత అవసరాలు, కుటుంబంతో గడపడానికి అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణలోనూ ఈ విధానం త్వరలో అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. వారాంతపు సెలవులపై ప్రతినెల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్‌లు అమలుచేస్తున్నారు. 

ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ వీక్లీ ఆఫ్ అమలుచేస్తానని హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వారాంతపు సెలవు అమలు సాధ్యాసాధ్యాల అధ్యయానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈకమిటీ సూచనల ప్రకారం మొత్తం 19 రకాలుగా వీక్లీ ఆఫ్ అమలుచేయాలని ప్రతిపాదించారు.

గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని పోలీసు స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు, ఎస్సైలకు వేర్వేరుగా, ట్రాఫిక్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది, వీఐపీలు, ఉన్నతాధికారుల వద్ద గన్‌మెన్లుగా, డ్రైవర్లుగా పనిచేసేవారు, నిఘా విభాగం, బెటాలియన్లలో పనిచేసేవారు ఇలా విభాగాల వారీగా వారాంతపు సెలవు ఎలా అమలు చేయాలనే దానిపై నివేదికను రూపొందించింది. మొత్తం మీద వీక్లీ ఆఫ్ అమలు పట్ట పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యులు హర్సం వ్యక్తం చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle