newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

ఏపీ పీసీసీ రేస్‌లో ఆ న‌లుగురు..!

30-09-201930-09-2019 11:02:19 IST
Updated On 30-09-2019 14:44:16 ISTUpdated On 30-09-20192019-09-30T05:32:19.415Z30-09-2019 2019-09-30T05:32:17.639Z - 2019-09-30T09:14:16.246Z - 30-09-2019

ఏపీ పీసీసీ రేస్‌లో ఆ న‌లుగురు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏఐసీసీ తాత్కాలిక అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల‌పై సీరియ‌స్‌గా ఫోక‌స్ పెట్టారు. ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు ఒక్కొక్క‌రుగా వారి వారి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరారెడ్డి కూడా నాడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2019 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యానికి బాధ్య‌త వ‌హిస్తూ ఆయ‌న హైక‌మాండ్‌కు త‌న రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.

ర‌ఘువీరా బీజేపీలో చేరుతారంటూ ఆ మ‌ధ్య ప్ర‌చారం జోరుగానే సాగింది. రఘువీరారెడ్డి రాజీనామాను అధిష్టానం ఆమోదించ‌క‌పోయినా ఆయ‌న మాత్రం బెంగ‌ళూరులోని త‌న సొంత బిజినెస్ ప‌నుల్లో మునిగిపోయారు. దీంతో పీసీసీ బాధ్య‌త‌ల‌ను మ‌రెవ‌రికైనా అప్ప‌గించే ప‌నిలో అధిష్టానంప‌డింది. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్‌, మాజీ మంత్రి శైల‌జానాథ్‌, ఏపీ కాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన సుంక‌ర ప‌ద్మ కూడా పీసీసీ చీఫ్ రేస్‌లో ఉన్నారు.

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ను నియ‌మించేందుకు హైక‌మాండ్ క‌స‌ర‌త్తు చేస్తోంది. రేసులో ముగ్గురు లీడ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ ప‌ళ్లంరాజు వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే పీసీసీ చీప్ ప‌ద‌వికి రాజీనామా చేసిన ర‌ఘువీరారెడ్డి క్రియాశీల రాజకీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. మ‌రోవైపు పార్టీ వీడిన సీనియ‌ర్‌ల‌ను మ‌ళ్లీ పార్టీలోకి తేవ‌డాన్ని ఢిల్లీ పెద్ద‌లు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వులు పొంది బాగా లాభ‌ప‌డిన వారెవ‌రూ తాజాగా ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి బాగాలేద‌న్న కార‌ణంతో ఏపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టేందుకు సిద్ధంగా లేర‌ని స‌మాచారం.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన ప‌ళ్లం రాజు కాకినాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుసార్లు గెలుపొందారు. ఏపీ కాంగ్రెస్ క‌మిటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. ఆ త‌రువాత అఖిల‌భార‌త కాంగ్రెస్ క‌మిటీ స‌భ్యుడిగా ఆయ‌న ప‌నిచేశారు. రెండోసారి లోక్‌స‌భ‌కు కాకినాడ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంత‌రం మ‌న్మోహ‌న్‌సింగ్ కేబినేట్‌లో 2006 నుంచి 2009 వ‌ర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడోసారి కూడా గెలుపొందారు. మ‌ళ్లీ మ‌న్మోహ‌న్ సింగ్ కేబినేట్‌లో ర‌క్ష‌ణ మంత్రిగా కొన‌సాగారు. ప‌ళ్లంరాజు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుల‌న్న పేరుంది.

ప‌ళ్లంరాజు తండ్రి శ్రీ‌రామ సంజీవ‌రావు కూడా మూడుసార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ప‌ళ్లంకు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌టం, కేంద్ర మంత్రిగా ప‌నిచేయ‌డం ఇవ‌న్నీ క‌లిసొస్తాయ‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి ప‌లువురు రాజ‌కీయ ఉద్దండులు అటు టీడీపీలోకి ఇటు వైసీపీలోకి, బీజేపీలోకి చేరిన‌ప్ప‌టికీ పళ్లం మాత్రం పార్టీలోనే ఉంటూ వ‌స్తున్నారు. ఇది కూడా ప‌ళ్లంకు పెద్ద అడ్వాన్టేజ్ కానుంది.

ఏపీపీసీసీ అధ్య‌క్షుడిగా కేంద్ర  మాజీ మంత్రి ప‌ళ్లంరాజును ఎంపిక చేయాల‌ని ఆ పార్టీ భావిస్తున్నా  అందుకు ఆయన సుముఖంగా లేన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్య‌క్షుడి ఎంపిక‌పై పార్టీ నేత‌ల అభిప్రాయాలు తీసుకోవాలంటూ ఎక్కువ మంది అధిష్టానానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. దీంతో ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీకి అధిష్టానం సూచించింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల నాటికి ఏపీసీసీకి సార‌ధిని నియ‌మించే కృత‌నిశ్చ‌యంలో హైక‌మాండ్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle