newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

ఏపీ పాలిటిక్స్ కేరాఫ్ దుబాయ్‌

24-11-201924-11-2019 15:38:04 IST
2019-11-24T10:08:04.541Z24-11-2019 2019-11-24T10:07:44.534Z - - 20-01-2020

ఏపీ పాలిటిక్స్ కేరాఫ్ దుబాయ్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు దుబాయ్ చేరాయి. ఓ శుభ‌కార్యం వేదిక‌గా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జ‌రుగుతోంది. ముఖ్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ కార్య‌క్ర‌మాన్ని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కోసం ఉప‌యోగించుకుంటుంద‌నే ప్ర‌చారం మొద‌లైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌తో బీజేపీ నేత‌లు ఈ వేడుక‌లోనే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు చెబుతున్నారు.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో కీల‌క నేత‌గా కొన‌సాగి ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బీజేపీలో చేరిన సీఎం ర‌మేష్ దుబాయ్‌లో త‌న కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం నిర్వ‌హిస్తున్నారు.

ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ర‌స్ అల్ ఖైమాలోని వాల్డ్రాప్ అస్టోరియా అనే ఓ స్టార్ హోట‌ల్ నిశ్చితార్థానికి వేదికైంది. ఈ కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత‌ల‌తో పాటు జాతీయ స్థాయిలోనూ చాలా మంది ఎంపీలకు సీఎం ర‌మేష్ ఆహ్వానం ప‌లికారు.

వీరంద‌రినీ దుబాయ్ తీసుకెళ్లేందుకు 15 ప్ర‌త్యేక ఫ్లైట్లు కూడా సీఎం ర‌మేష్ ఏర్పాటు చేశారంటే ఆయ‌న ఎంత ఘ‌నంగా త‌న కుమారుడి ఎంగేజ్‌మెంట్ జ‌రుపుతున్నారో అర్థ‌మ‌వుతోంది.

అయితే, ఈ కార్య‌క్రమాన్ని బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఉప‌యోగించుకుంటోంద‌ని తెలుస్తోంది. సీఎం ర‌మేష్‌తో స‌న్నిహిత సంబంధాల కార‌ణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు ఈ వేడుక‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

అక్క‌డే వీరితో బీజేపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని, ఈ వ్య‌వ‌హారం రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఏపీ బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్న సుజ‌నా చౌద‌రి నేతృత్వంలో జ‌రుగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు కూడా ఈ వేదిక‌కు ఆహ్వానం అందింది. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులను బ‌ట్టి వీరు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల‌తో ఆ పార్టీ నేత‌లు చ‌ర్చ‌లు సైతం జ‌రిపారు.

కొంద‌రు బీజేపీలో చేరేందుకు సంసిద్ధ‌త కూడా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. వీరంద‌రితోనూ దుబాయ్‌లో ఫైన‌ల్ చ‌ర్చ‌లు జ‌రిపి వారిని బీజేపీలోకి తీసుకువ‌చ్చేలా ఆ పార్టీ నేతలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది.

కాగా, త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ బీజేపీలో వెళ్ల‌ర‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. సీఎం ర‌మేష్‌తో ప‌రిచ‌యాల కార‌ణంగానే నిశ్చితార్థానికి వెళ్లారు కానీ ఎటువంటి రాజ‌కీయ చ‌ర్చ‌లూ ఉండ‌వ‌ని అంటున్నారు. మ‌రోవైపు ఏకంగా అతిథుల కోసం 15 విమానాలు బుక్ చేయ‌డం, దుబాయ్‌లో వేడుక అట్ట‌హాసంగా జ‌రుపుతుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   4 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle