ఏపీ నుండి ఐటీ పరిశ్రమ అవుట్?
19-11-201919-11-2019 17:48:58 IST
2019-11-19T12:18:58.475Z19-11-2019 2019-11-19T12:18:55.820Z - - 15-12-2019

ఆంధప్రదేశ్ రాష్ట్రం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ కూడా దూరమయ్యేందుకు సిద్దమైందా? అంటే ఆ రంగంలో నిపుణుల నుండి అవుననే వినిపిస్తుంది. రాష్ట్రంలో అధికారికంగా 170 పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఎనభై శాతం పరిశ్రమలు ఒక్క విశాఖలో ఉండగా మరో ఇరవై శాతం రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, తిరుపతి నగరాలలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం దాదాపు నలభై వేలమంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్క విశాఖలోనే పాతిక వేలమంది వరకు ఉండొచ్చని అంచనా. ఇక అనధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకుండా కూడా కొన్ని కంపెనీలు కార్యకలాపాలను చేస్తుండడం కూడా అందరికీ తెలిసిన నిజమే. అయితే అధికారికంగా ఇప్పుడున్న 170 పైగా కంపెనీలలో డెబ్భై శాతం కంపెనీలు గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చినవే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుండి తరలివచ్చే విధంగా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం రెంటల్ సబ్సిడీ, స్పెషల్ ఇన్సెంటివ్స్ కల్పించింది. అంటే కార్యాలయాలు నెలనెలా చెల్లించే అద్దెలో యాభై శాతం ప్రభుత్వం చెల్లించేందుకు హామీ ఇచ్చి రాష్ట్రానికి తీసుకొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రాంతంలో కేవలం ఐటీ ఆదాయం రూ 800 కోట్లే ఉండగా గత ఐదేళ్లలో అది రూ 2500 కోట్లకు పెంచారు. 2022 సంవత్సరం నాటికి దానిని రూ 15000 కోట్లకు తీసుకెళ్లే విధంగా గత ప్రభుత్వం సబ్సిడీలను ప్రకటించింది. ఐటీ పరిశ్రమలకు రెంటల్ సబ్సిడీ, స్పెషన్ ఇన్సెంటివ్స్ కానీ సుమారుగా నెలకు ఆరుకోట్ల రూపాయలను గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ కంపెనీలకు చెల్లించాల్సిన రాయితీలు, రెంటల్ సబ్సిడీలు చెల్లింపులు నిలిపివేశారు. దీనిపై ఏపీ ఐటి అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధులు ఈ మధ్యనే రాష్ట్ర ఐటి ప్రిన్సిపల్ కార్యదర్శి కోన శశిధర్‌ను కలిసి విజ్ఞప్తులు కూడా చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ నివేదికను కూడా అందించారు. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కూడా లేకపోవడం, ఐదు నెలలుగా రాష్ట్ర ఐటీకి సంబంధించిన ఒక్కటంటే ఒక్క సెమినార్ నిర్వహించకపోవడం వంటి వాటితో ఇక రాష్ట్రం నుండి వెళ్లడమే మేలని నిర్ణయానికి వచ్చేశారట. ఒకపక్క దేశంలో ఆర్థికమాంద్యం మరోపక్క రాష్ట్రం నుండి ఎలాంటి స్పందన లేకపోగా అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పక్కదారి పట్టినట్లుగా చెప్తున్నారు. విశాఖలోని కార్పొరేట్ కంపెనీలైన విప్రోలో 350 మందిని తొలగించడంతో మరో 300 మందికి పైగా ఇతర బ్రాంచీలకు ట్రాన్సఫర్స్ చేయగా టెక్ మహీంద్రాలో గత నెలలో ముప్పై మందిని తొలగించారట. ఇక చిన్నా చితకా కంపెనీలైతే శాలరీలలో భారీకోత విధించి పనులు చేయించుకుంటున్నాయట. మహా అయితే కొత్త ఏడాది నాటికి విశాఖ ఐటీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఏపీ ఐటీ నిపుణుల నివేదిక చెప్పకనే చెప్పింది.

కాంగ్రెస్‌లో ఆ నలుగురూ ఒక్కటవుతున్నారట..!
2 hours ago

జగన్ ఎఫెక్ట్.. ఫుల్ బిజీగా ప్రశాంత్ కిషోర్..!
2 hours ago

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
3 hours ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019
ఇంకా