newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

ఏపీ-తెలంగాణ మంత్రుల దెప్పిపొడుపులు..!

02-01-202002-01-2020 16:56:56 IST
Updated On 02-01-2020 17:08:34 ISTUpdated On 02-01-20202020-01-02T11:26:56.726Z02-01-2020 2020-01-02T11:26:30.394Z - 2020-01-02T11:38:34.857Z - 02-01-2020

ఏపీ-తెలంగాణ మంత్రుల దెప్పిపొడుపులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే.. మంచిగానే ఉన్నాయని చెప్పుకోడానికి ఎక్కడో అనుమానాలు రాకమానదు. పోనీ, గత ప్రభుత్వాల మాదిరి శత్రుత్వం ఉందా అంటే మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు కెసిఆర్-జగన్ సర్కార్ల మధ్య ఉన్న సంబంధాలను తేల్చే పరిస్థితి లేకపోయినా ఎవరికి వారిని అడిగితే ముఖ్యమంత్రులు మాత్రం ఒకరికి మరొకరం దోస్తులం అనే చెప్తారు.

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ స్నేహగీతానికి రెండు కళ్ళు చాలలేదు. పరస్పర సహకారం.. రెండు రాష్ట్రాల అభివృద్దే మా ధ్యేయం అని ఇద్దరు ముఖ్యమంత్రులు వల్లెవేసిన మాటలు ఇంకా ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఉమ్మడి ప్రాజెక్టులకు కూడా పునాదులు పడనున్నాయని అనుకున్నారు. కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టింది.. అందుకే ఈ మధ్య ఆ పలకరింపులు కనిపించడం లేదు.

ఇక అయన ప్రత్యేక అతిధిగా వెళ్లిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఏపీ ప్రభుత్వం కోర్టుకి వెళ్లిన పరిస్థితి సంచలనంగా మారింది. మరోపక్క తెలంగాణ సీఎం కూడా మౌనంగా ఉండిపోయారు. అయితే రెండు రాష్ట్రాల మంత్రులు మాత్రం ఒక ప్రభుత్వంపై మరొకరు దెప్పిపొడుపులు ఆసక్తిగా ఉంటున్నాయి. ఇందులో రెండు ప్రభుత్వాల మంత్రులు పోటీపడుతున్నట్టుగా కనిపిస్తుంది.

తెరాస ప్రభుత్వం ముఖ్య నేత, కీలకమంత్రి హరీష్ రావు ఏపీలో పరిస్థితులపై సెటర్లు వేశారు. హైదరాబాద్ రియల్టర్ల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఏపీలో రాజధాని రగడను వివరిస్తూ అక్కడి పరిస్థితిలు మనకు కలిసి వస్తున్నాయని సద్వినియోగం చేసుకోవాలని కాస్త వెటకారంతో కూడిన సైగలతో చెప్పారు. దీంతో ఎదురుగా ఉన్న రియల్టర్లు ఒక్కసారిగా నవ్వేశారు.

ఇక ఏపీ మంత్రులు కూడా తక్కువేం తినలేదు. ఆర్టీసీ విలీనం గురించి వచ్చిన ప్రతిసారి తెలంగాణలో సీఎం కెసిఆర్ చేతులెత్తేసినా సీఎం జగన్ మాత్రం చేసి చూపించారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జనవరి 1న ఏపీ ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వంలో విలీనం అయిన సందర్భంగా కార్మికులు కొందరు మంత్రులకు సన్మానం చేశారు. పేర్ని నానీ కూడా సన్మానం చేయించుకున్న ఉత్సాహంలో మరోసారి ఈ మాటలే చెప్పుకొచ్చారు.

సీఎం కెసిఆర్ కు అనుభవం ఉంది కానీ సంకల్పం లేదని.. అదే సీఎం జగన్ కు అనుభవం లేకపోయినా సంకల్పం ఉందని.. కెసిఆర్ కన్నా జగనే గొప్ప అని మంత్రి నానీ చెప్పుకొచ్చారు. అక్కడ కూడా అదే సీన్.. అనుభవం ఉంటే సరిపోదని కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు అందరూ నవ్వేశారు. మరి రెండు ప్రభుత్వాల మధ్య మంత్రుల వ్యవహారం చూస్తుంటే త్వరలోనే తత్సంబంధాలలో ఏదో తేడా కొట్టేసేలా ఉందే అనిపిస్తుందండోయ్!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle