newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఏపీ జిల్లాల స్వ‌రూపం మారుతుందా..?

14-09-201914-09-2019 17:01:50 IST
2019-09-14T11:31:50.089Z14-09-2019 2019-09-14T11:29:32.161Z - - 15-12-2019

ఏపీ జిల్లాల స్వ‌రూపం మారుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
13 జిల్లాలతో కూడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను భ‌విష్య‌త్తులో 25 జిల్లాలుగా చేస్తామ‌ని, ఏపీ స్వ‌రూపాన్ని మారుస్తామ‌ని, ప‌రిపాల‌నా సౌల‌భ్యాన్ని మార్చే దిశ‌గా సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోను, పాద‌యాత్ర‌లోను హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వంలోకి రాగానే అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్ర‌మాలపై అతి త‌క్కువ కాలంలోనే నిర్ణ‌యాలు తీసుకున్నా.. కొత్త జిల్లాల ఏర్పాటులో మాత్రం ఆ దూకుడును కొంత మేర త‌గ్గిస్తే బాగుంటుంద‌న్న భావ‌న‌తో జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను ఇప్పుడే మొద‌లుపెట్టేద్దామ‌ని గతంలో భావించిన స‌ర్కార్ దానికి అనుగుణంగా కొద్దిపాటి క‌స‌ర‌త్తు కూడా చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌స్తుతం ఏపీలోని 13 జిల్లాల స‌గ‌టు జ‌నాభా 37.98 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంది. అలాగే పొరుగున ఉన్న తెలంగాణ‌లో జిల్లాల పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ త‌రువాత కొత్త జిల్లాలు ఏర్ప‌డ్డాక ఆ రాష్ట్రంలో జిల్లాల స‌గ‌టు జ‌నాభా 11.35 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఉంది.

ఇక చ‌త్తీస్‌ఘ‌డ్ వంటి రాష్ట్రంలో జిల్లాలో జ‌నాభ స‌గ‌టు 9.46 ల‌క్ష‌ల జ‌నాభా అని, ఇక దేశ వ్యాప్తంగా 725 జిల్లాలు ఉంటే జిల్లాల స‌గటు జ‌నాభా 19 ల‌క్ష‌లుగా ఉంది. అంటే ఏ విధంగా చూసినా ఏపీలో జిల్లాల స‌గ‌టు అన్ని లెక్క‌ల‌కంటే ఎక్కువ‌గానే ఉంది. ఇలాంటి ప్రాథ‌మిక స‌మాచారంతోపాటు మ‌రింత లోతైన స‌మాచారాన్ని కూడా సేక‌రించే ప‌నిలో ప‌డిన అధికారులు తాత్కాలికంగా ఆ ప్రక్రియను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

ఆర్థిక ప‌రిపుష్టి స‌రిగ్గా లేకుండా జిల్లాల విభ‌జ‌న చేస్తే మ‌రిన్ని ఆర్థిక ఇబ్బందులు వ‌స్తాయ‌నే భావ‌న‌తో, ఇంకొన్ని సాంకేతిక‌, రాజ‌కీయ కార‌ణాల‌వ‌ల్ల కూడా ఈ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన‌ట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూసుకున్నా ఇప్ప‌టికిప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణ‌య తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న‌తో మెజార్టీ నేత‌లు ఉన్నార‌న్న‌ది స‌మాచారం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle