newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

16-07-201916-07-2019 18:33:37 IST
Updated On 16-07-2019 18:42:16 ISTUpdated On 16-07-20192019-07-16T13:03:37.416Z16-07-2019 2019-07-16T13:03:35.842Z - 2019-07-16T13:12:16.180Z - 16-07-2019

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమిస్తూ  రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. బిశ్వభూషణ్ హరిచందన్‌ ఒడిషా బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఆ రాష్ట్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ తెలంగాణకు పరిమితం అవుతారు.

ఒడిషాకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిచందన్ అక్కడ బీజేపీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. ఆయన క్రమశిక్షణ కలిగిన సీనియర్ నేత. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు ఒడిషా ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన పని చేశారు. 84 ఏళ్ళ బిశ్వభూషణ్ హరిచందన్ చిల్కా, భువనేశ్వర్ స్థానాల నుంచి 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004 లో బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1971లో భారతీయ జన్ సంఘ్ సభ్యుడిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 

కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్‌లను నియమించాలని యోచిస్తూ వచ్చిన కేంద్రం... ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రాజ్ భవన్‌ కోసం పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నర్‌గా నియమించిన కేంద్రం.

ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా అనసూయ సుశీని నియమించింది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌ గా బదిలీ అయ్యారు. పలు రాష్ట్రాలకు కేంద్రం కొత్తవారిని నియమించే ప్రక్రియను హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle