newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ఏపీ కేబినెట్ భేటీ.. సర్వత్రా ఉత్కంఠ

27-12-201927-12-2019 08:44:06 IST
Updated On 27-12-2019 11:11:32 ISTUpdated On 27-12-20192019-12-27T03:14:06.380Z27-12-2019 2019-12-27T03:07:53.857Z - 2019-12-27T05:41:32.632Z - 27-12-2019

ఏపీ కేబినెట్ భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. రాజధాని మార్పు, జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కర్నూలులో విద్యార్థులు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు నేడు మనవహారాలు, ర్యాలీలకు పిలుపునిచ్చారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల అభిప్రాయాల సేకరణకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటవుతుందని భావిస్తున్నారు. 104, 108 వాహనాల కొనుగోలు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకాలకు సంబంధించి సవరణలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 

అలాగే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిన రిజర్వేషన్లపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇటు రాజధాని రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అమరావతి మందడంలో టెన్షన్ టెన్షన్ వ్యక్తం అవుతోంది. ఉదయం నుంచి రైతుల ధర్నా కొనసాగుతోంది. రోడ్డుపై టెంట్లు తొలగించాలని పోలీసులు సూచించారు.

టెంట్లు తీసేది లేదంటూ గ్రామస్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉందని డీజీపీనే స్పష్టం చేశారని. తమను అడ్డుకోవడం ఏంటని రైతులు మండిపడుతున్నారు.

గత నెలలో చంద్రబాబు రాజధాని పర్యటన సందర్భంగా డీజీపీ నిరసనలకు అనుమతి ఇచ్చారని. ఇవాళ శాంతియుతంగా మేము చేసే నిరసనలకూ పోలీసులు అనుమతివ్వాలని రైతులు డిమాండ్ చేశారు.

మరోవైపు సీఎం క్యాంపు ఆఫీస్ లో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. 3 రాజధానులు, రైతుల ఆందోళనపై చర్చించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

అమరావతి ప్రాంతవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. విపక్షనేత చంద్రబాబు రైతుల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలు నమ్మవద్దన్నారు.

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల్లో భూములిచ్చిన రైతులు కూడా ఉన్నారని, అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని బొత్స చెప్పారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. కేబినెట్ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle