newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

ఏపీ కేబినెట్ భేటీ... మరో పథకానికి శ్రీకారం

16-10-201916-10-2019 19:46:31 IST
2019-10-16T14:16:31.320Z16-10-2019 2019-10-16T14:16:29.948Z - - 02-04-2020

ఏపీ కేబినెట్ భేటీ... మరో పథకానికి శ్రీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజుకో కొత్త పథకం.. ఎన్నికల హామీల అమలుకు కృ‌తనిశ్చయం. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇవాళ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ పలు కీలకాంశాలకు, నిర్ణయాలకు వేదికైంది. చేనేత కార్మిక కుటుంబాలకు రూ.24వేల సాయం, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం రూ.10వేలకు పెంపు తదితర కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

చేనేత కార్మికుల కుటుంబాలకు లబ్ది చేకూర్చేలా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ కింద ఏడాదికి రూ.24వేల ఆర్థికసాయం ఇవ్వాలని నిర్ణయం. ఏటా డిసెంబర్‌ 21న అందజేత. దీంతో 90వేల కుటుంబాలకు లబ్ధి. ఈ పథకం కింద రూ.216కోట్లు ఖర్చు అవుతుంది. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.10వేలకు పెంచారు.

మెకనైజ్డ్‌ బోట్లు ఉన్నవారికే కాకుండా తెప్పలపై వేట సాగించే వారికి కూడా తొలిసారిగా ఈ పథకం వర్తింపు. అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21న ఈ పథకం ప్రారంభం కానుంది. ఇదే కాకుండా..మత్స్యకారులకు డీజిల్‌పై లీటర్‌కు రూ.9 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం. డీజిల్‌ కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ వర్తింపు. దీనికోసం నిర్దేశిత బంకుల ఏర్పాటు. నవంబర్‌ 21 నుంచి అమలు. సుమారు రూ.100కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. 

హోంగార్డులకు జగన్ తీపి కబురు చెప్పారు. కేబినెట్ సాక్షిగా జీతాల పెంపునకు ఆమోదముద్రవేశారు. రోజుకు ఇచ్చే రూ.600 అలవెన్స్‌ను రూ.710కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి నెలవారీ వేతనం ఈ పెంపువల్ల 3300 రూపాయలు పెరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచారు. ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీలో కాలం చెల్లిన సుమారు 3500 బస్సులను తొలగించి కొత్త బస్సుల కొనుగోలుకు కేబినెట్‌ ఆమోదం.

దీనికోసం రూ.వెయ్యికోట్ల రుణానికి ఆర్టీసీకి అనుమతిచ్చింది. అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బార్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మూడేళ్లలోపు జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించారు జగన్.  రైతులకు ఉచిత బోర్లు వేసేందుకు 200 డ్రిల్లింగ్‌ యంత్రాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. కీలక పథకాలకు శ్రీకారం చుడుతూ తీసుకున్న కేబినెట్ నిర్ణయాలను అంతా స్వాగతిస్తున్నారు. 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   5 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   5 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   6 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   7 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   8 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   9 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   10 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   11 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   12 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle