newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ

30-10-201930-10-2019 09:43:09 IST
2019-10-30T04:13:09.665Z30-10-2019 2019-10-30T04:12:59.686Z - - 20-11-2019

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్షిస్తారు. పలు కీలకాంశాలు, వివిధ పథకాల ప్రారంభోత్సవాలపై కేబినెట్ చర్చించనుంది.

ఇనామ్‌ భూములకు సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.అలాగే, రాష్ట్రంలోని రిటైర్డ్‌ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి సిద్ధం చేసిన మార్గదర్శకాలను కేబినెట్‌ ఆమోదిస్తుందని అంటున్నారు. 

అయితే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలి ఉత్తర్వులో స్పష్టత లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్చించే అవకాశం ఉంది. వైఎస్‌ హయాంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమితులైనవారు కూడా ఈ ఉత్తర్వు ప్రకారం ఉద్వాసనకుగురి కావలసిన పరిస్థితి నెలకొంది. 

ఈ అంశంపైన కేబినెట్‌ భేటీలో స్పష్టత ఇచ్చే వీలుంది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఏర్పాటుపై చర్చ.. రాష్ట్రవ్యాపంగా 147 వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై ప్రతిపాదన.. రూ. 197 కోట్లతో నియోజకవర్గానికి ఒక అగ్రిల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించడం, కంటివెలుగు, మత్స్యకారులకు సహాయం, అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీపై చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle