newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

ఏపీ కేబినెట్ భేటీ: ఈసీతో పోరులో బాబు గెలిచారా?

14-05-201914-05-2019 07:23:53 IST
Updated On 28-06-2019 12:53:45 ISTUpdated On 28-06-20192019-05-14T01:53:53.193Z14-05-2019 2019-05-14T01:53:42.800Z - 2019-06-28T07:23:45.174Z - 28-06-2019

ఏపీ కేబినెట్ భేటీ: ఈసీతో పోరులో బాబు గెలిచారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు పంతం నెగ్గింది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కోడ్ కారణంగా ఏపీ కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ రేగింది. ఏపీ మంత్రివర్గ సమావేశంపై నిర్ణయం వెలువడింది.  ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో రేపు మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్‌ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంపారు. నోట్‌ అందిన రెండు పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని ఈసీ పేర్కొంది. 

ఈసీ ఏం చెబుతుందా అని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూసింది. ఈసీ నుంచి స్పష్టత రావడంతో కేబినెట్లో ఏం చర్చించాలనేది నిర్ణయించారు. ఈ అంశంపైనే సీఎస్ ముఖ్యమంత్రితో చర్చించారు. ఇటీవల ఇద్దరి మధ్య నెలకొన్న కోల్డ్ వార్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో  వీరిద్దరూ ఏం చర్చించారనేది హాట్ టాపిక్ అయింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అసాధారణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ భేటీ జరపవచ్చు. ఒకవేళ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆ నిబంధన ప్రకారం ఆదివారం సాయంత్రానికి సమయం అయిపోయింది. ఇవాళ సోమవారం కావడంతో సాయంత్రానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని భావించారు. చివరికి అదే జరిగింది.

సీఎంవో రూపొందించిన అజెండాపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ శుక్రవారం చర్చించి పంపిన నాలుగు అంశాలకు ఈసీ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు అంశాలపై అత్యవసరంగా కేబినెట్‌ భేటీ నిర్వహించాలని సీఎంవో నిర్ణయించింది.

ఫొని తుపాను, కరవు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై అత్యవసరంగా చర్చించాల్సి ఉన్నందున కేబినెట్‌ భేటీ నిర్వహించాలని భావించింది. దీనిపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఈ నాలుగు అంశాలపై చర్చించి ఈసీకి అజెండా నోట్‌ను పంపింది. మంగళవారమే కేబినెట్‌ భేటీ జరుగుతుంది.  మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. మొత్తం మీద ఈసీ కోడ్ ఉన్నా చంద్రబాబు తన పంతం నెగ్గించుకున్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే బాబు కేబినెట్ భేటీ నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle