ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఏపీ కేబినెట్ భేటీపై ఎడతెగని సస్పెన్స్

07-05-201907-05-2019 16:40:42 IST
Updated On 08-05-2019 11:08:12 ISTUpdated On 08-05-20192019-05-07T11:10:42.572Z07-05-2019 2019-05-07T11:10:15.892Z - 2019-05-08T05:38:12.341Z - 08-05-2019

ఏపీ కేబినెట్ భేటీపై ఎడతెగని సస్పెన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల కమీషన్‌తో ఢీ కొట్టడానికి ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ సిద్ధపడుతున్నారు. ఒక పక్క ఏపీ సీఎంకి కేంద్ర ఎన్నికల కమీషన్‌కి, మరో పక్క చంద్రబాబుకి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ముదిరి పాకాన పడి హాట్ వార్‌గా మారేలా కనపడుతోంది. మోదీ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించగాలేనిది తాను నిర్వహించకూడదా అని ఈ నెల 10 వ తెదీన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చెయ్యమని ఛీఫ్ సెక్రెటరీ‌కి సీఎంఓ నుంచి లేఖ పంపించడంతో రాజకీయాలు వేడెక్కాయి.

మంగళవారం మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్ సుబ్మహ్యణ్యం సమావేశమయ్యారు. భేటీ పూర్తయిన అనంతరం సీఎస్ సుబ్రహ్మణ్యం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ నెల 10న కేబినెట్ నిర్వహణ అనుమానమేనని సీఎస్ చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందన్నారు. 

అజెండాలో అంశాలపై ఈసీఐ అనుమతి ఇస్తేనే కేబినెట్ భేటీ ఉంటుందని సీఎస్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఉంటే కేబినెట్ నిర్వహించాలని, అందుకు మాత్రమే ఈసీ అనుమతి ఉంటుందన్నారు. తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలు ఉంటేనే కేబినెట్‌లో పెడతామంటున్నారు. ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

సీఎంవో ఇచ్చే అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు.  ఆయా శాఖలు ఇచ్చిన సమాచారాన్ని సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని.. ఈసీకి పంపించాల్సిన అంశాలు ఇక్కడినుంచి పంపిస్తామన్నారు. ఈసీఐకు 48 గంటలు ముందు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. 

సీఎస్ చెప్పినదాన్ని బట్టి కేబినెట్ భేటీ ఉండకపోవచ్చని అంటున్నారు. కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకోవాలంటే 48 గంటల సమయం కావాలని, అన్ని అంశాలు ఈసీకి తెలియచేస్తే ఈసీ అనుమతి ఇస్తుంది. అయితే ఇప్పటివరకూ ఎజెండా అంశాలు ఈసీకి పంపాలంటే సీఎస్ దగ్గర సమాచారం ఉండాలి. కానీ ఆ సమాచారం ఇంకా చేరలేదని తెలుస్తోంది.

ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే కేబినెట్ భేటీ అనుమానమే అంటున్నారు. మరి కేబినెట్ భేటీ పెట్టి తీరాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ కేబినెట్ భేటీ పెడితే ఎంతమంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఆ భేటీకి హాజరవుతారో చూడాలి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఏపీలో కేబినెట్ భేటీకి ఈసీ ఒప్పుకుంటుందా? అనేది సస్పెన్స్‌గా ఉంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle