newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు

04-09-201904-09-2019 13:01:34 IST
Updated On 05-09-2019 15:38:15 ISTUpdated On 05-09-20192019-09-04T07:31:34.190Z04-09-2019 2019-09-04T07:31:28.164Z - 2019-09-05T10:08:15.971Z - 05-09-2019

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, తాజా టెండర్లకు ఆహ్వానం, ఆశావర్కర్ల వేతన పెంపు, మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

మావోయిస్టులపై నిషేధం మరో ఏడాదిపాటు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్ల వేతనం పెంపుకు ఆమోదం..రూ. 3వేల నుంచి రూ. 10వేల రూపాయల పెంపుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిలో పనులు ప్రారంభించకపోవడంతో ఆభూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ భూముల లీజు కూడా చెల్లించలేదని పరిశ్రమల శాఖ కేబినెట్‌కు తెలియజేయడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు అక్రమ గనులు....యరపతినేని అక్రమాలపై సీబీఐ విచారణకు అప్పజెప్పాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

జగన్ సర్కార్ వచ్చాక ఇదే తొలి సీబీఐ విచారణ కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే, .కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం లభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికపై చర్చ జరిగింది. 

దీంతోపాటు కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది కేబినెట్. రూ.375కు టన్ను ఇసుక ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, .ప్రజలు ఆన్‌లైన్లో కూడా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కలిగించింది.

13 జిల్లాల్లో 41 ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసింది. అక్టోబర్ చివరి నాటికి 80 వరకు పెంచేలా చర్యలు తీసుకుంటారు. సొంత ఆటోలు, ట్యాక్సీలు ఉండి, వాటిని నడుపుకొనే వారికి ప్రభుత్వం వరాలు కురిపించింది. వారికి ఏటా రూ.10వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle