newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి- ఉనికినైనా కాపాడుకోగలదా.?

14-09-201914-09-2019 18:21:33 IST
Updated On 14-09-2019 18:21:27 ISTUpdated On 14-09-20192019-09-14T12:51:33.266Z14-09-2019 2019-09-14T11:46:28.656Z - 2019-09-14T12:51:27.248Z - 14-09-2019

ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి- ఉనికినైనా కాపాడుకోగలదా.?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండుగా చీలినప్పటి నుంచీ ఏపీలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రంగా మారిపోయింది. 2014 ఎన్నికలలో ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక డీలా పడిన ఆ పార్టీకి 2019 ఎన్నికలలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. పోటీలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులలో అత్యధికులు కనీసం డిపాజిట్ కూడా గెలుచుకోలేని పరిస్థితిని చూస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి సంక్షోభంలోనికి కూరుకు పోతున్న దృశ్యం ఆవిష్కృతం కాక తప్పదు. విభజనలో ఏపీకి అన్యాయ జరిగందన్న ఆవేదన, ఆ అన్యాయం చేసింది కాంగ్రెస్సేనన్న ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఇప్పటికీ అలాగే రగులుతున్నది.

కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ కూడా ఏపీకి అన్యాయం చేసిందన్న భావన కూడా ఏపీలో ఉంది. అందుకే బీజేపీకి 2019లో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క స్థానం రాలేదు. అయితే కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ఏపీలో శ్యూన్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. కాంగ్రెస్ కు తిరుగులేని పట్టు ఉన్న రాష్ట్రాలలో ఏపీ అగ్రభాగంలో ఉండేది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికలలో దేశం అంతా జనతా పవనాలు విచినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందిరా గాంధీ నాయకత్వంలోని ఇందిరా కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.

అంతెందుకు స్వయంగా ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉమ్మడిగా ఉన్న కాలంలో అత్యధిక కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం, కాంగ్రెస్ దే ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఆవిర్భవించేంత వరకూ కాంగ్రెస్ కు తిరుగులేదు. అధికారం, ఆధిపత్యం ఆ పార్టీతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల రంగంలోనికి దిగిన తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారింది. పోటీ కూడా ఇరు పార్టీల మధ్యే అన్నట్లుగా సాగింది.

తెలుగుదేశం చేతిలో పరాజయం పాలైన ఏ సందర్భంలోనూ కూడా రాష్ట్రంలో పార్టీ బలహీనపడిందన్న భావన పార్టీ కేడర్ లో రాలేదు. అయితే 2014 ఎన్నికలలో పరాజయం తరువాత మాత్రం ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయా అన్న సందేహాలు వచ్చాయి.

కాంగ్రెస్ పట్ల ప్రజాగ్రహం ఎంత తీవ్రంగా ఉందంటే..2019 సార్వత్రిక ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేసిన తెలుగుదేశం పార్టీని కూడా ఆంధ్రులు ఉపేక్షించలేదు. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినందుకు అక్కడా ప్రజల ఆదరణ కరవైంది. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలో పార్టీకి క్యాడర్ నే లేకుండా చేసిందా అన్నట్లుగా ఆ పార్టీకి విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో పడిన ఓట్ల శాతం ఉంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ సారథిలేని అనాథలా ఉంది.

ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత ఏపీసీసీ చీఫ్ గా రఘువీరా రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందిందా? ఆయన స్థానంలో మరొకరి నియామకం జరిగిందా అన్న విషయం కూడా పట్టించుకునే నాథుడు లేనట్లుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఉంది. క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకుడే లేని పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ ది. ఉన్న నేతలంతా మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలకే పరిమితమైన పరిస్థితి. ఏదైనా కార్యక్రమం చేపట్టి కదలి రావాలని పిలుపునిద్దామన్నా కలిసి వచ్చేందుకు కార్యకర్తలేని లేక నీరసించిన స్థితిలో ఏపీ కాంగ్రెస్ ఉంది.

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం తరువాతైనా రాష్ట్రంలో తన పట్టును పెంచుకుని ప్రధాన స్రవంతిలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. ఇప్పట్లో ఏపీలో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికైనా ప్రయత్నించే పరిస్థితి కనిపించడం లేదు.

Image result for andhrapradesh congress party

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   3 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   11 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle