newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఏపీ ఐటీ రాజధానిగా విశాఖ.. సర్కార్ అడుగులు..!

15-09-201915-09-2019 10:34:16 IST
2019-09-15T05:04:16.561Z15-09-2019 2019-09-15T05:04:01.041Z - - 05-08-2020

ఏపీ ఐటీ రాజధానిగా విశాఖ.. సర్కార్ అడుగులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఐటీ అన‌గానే వెంట‌నే గుర్తుకొచ్చేది విశాఖ‌ప‌ట్నం. ప‌దిహేనేళ్లుగా కొత్త కొత్త ఐటీ సంస్థ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోన్న ఈ సిటీ ఇప్ప‌టికే 25 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. రూ.1,500 కోట్ల విలువైన ఐటీ ఎగుమ‌తులు చేస్తోంది. ఇక్క‌డ ఐటీని మ‌రింత వేగంగా అభివృద్ధి చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం విశాఖ‌ను ఐటీ కాపిట‌ల్‌గా ప్ర‌క‌టించ‌బోతోంది.

ఏపీలో ప్ర‌భుత్వాలే కాదు.. ఐటీ మంత్రులు మారిన ప్ర‌తిసారీ పాల‌సీలు మారుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది విశాఖ‌లో ఐటీరంగ అభివృద్ధిపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. గత ప్రభుత్వ హ‌యాంలో మ‌ధుర‌వాడ‌, కాపులుప్పాడ ప్రాంతాల్లో భూముల‌ను చ‌దునుచేసి ఐటీ రంగానికి కేటాయించేందుకు సిద్ధం చేశారు. డేటా సేవింగ్స్ సిస్ట‌మ్ కింద అదాని గ్రూప్‌కు అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కార్ భూములు కేటాయించింది. అలాగే మ‌రికొన్ని కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇచ్చేందుకు నాటి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

కానీ, ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో ఐటీ రంగం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయింది. మ‌రోవైపు ఐటీరంగంలో ఉపాధి అవ‌కాశాలు పెంచాల‌ని, కొత్త కంపెనీల‌ను ర‌ప్పించాల‌ని గ‌త ప్ర‌భుత్వం అనేక రాయితీల‌ను ప్ర‌క‌టించింది. వాటికి ఆకర్షితులై సొంత రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటుకు చాలా మంది ముందుకు వ‌చ్చారు. పాత కంపెనీలు వాటి ప‌రిధిని విస్త‌రించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

కానీ, వాటికి అందాల్సిన రాయితీలు మాత్రం గ‌త న‌వంబ‌ర్ నుంచి అంద‌డం లేదు. దీంతో బ‌కాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్క విశాఖ‌న‌గ‌రంలోని ఐటీ సంస్థ‌ల‌కే ప్ర‌భుత్వం రూ.25 కోట్ల వ‌ర‌కు బ‌కాయి ప‌డింది. దీంతో ఆయా కంపెనీల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. విశాఖ‌లో విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి ప్ర‌ముఖ ఐటీ కంపెనీల కార్యాల‌యాలు ఉన్నా.. మైక్రోసాఫ్ట్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఒరాకిల్ వంటి ప్ర‌ఖ్యాత కంపెనీలేవీ లేవు. మ‌రోవైపు విశాఖ‌లోని ఐటీసెస్‌తోపాటు ఐటీ పార్కుల్లో సగానికిపైగా స్థ‌లం ఖాళీగానే ఉంది.

ప్ర‌స్తుతం ఉన్న ఐటీ పార్కులు, ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌లు స్టార్ట‌ప్ విలేజ్‌ల‌లో 7 ల‌క్ష‌ల 41వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంగ‌ల ఐటీ స్పేస్ ఉంటే అందులో నాలుగు ల‌క్ష‌లా 67 వేల 500 చ‌ద‌ర‌పు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. రుషికొండ ఐటీహిల్స్‌తోపాటు వీఐసీ రోడ్డులోని ఐటీ స్పేస్ సైతం ఖాళీగానే ఉంది.

ఇక విప్రో బిల్డింగ్స్‌లో ఉన్న కంపెనీల‌న్నీ సెజ్‌లోకి మారేందుకు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. రుషికొండ హిల్ -3లోని స్టార్ట‌ప్ విలేజ్‌కు, ఇన్నోమైండ్ కంపెనీకు స్థ‌లం ఇవ్వ‌గా అవి కేవ‌లం ఆరువేల 500 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని మాత్ర‌మే వినియోగించుకోగ‌లుగుతున్నాయి. మ‌రోవైపు ఐటీలో విశాఖ‌కంటే హైద‌రాబాద్, బెంగ‌ళూరు, పూణే వంటి న‌గ‌రాల్లో మెరుగైన వాతావ‌ర‌ణం ఉంది. నిపుణులు సైతం అక్క‌డే ఉన్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తెలంగాణ‌లో ఐటీ ట‌ర్నోవ‌ర్ ల‌క్ష కోట్ల‌కు చేరుకుంటే ఏపీలో మాత్రం 1500 కోట్ల‌కు ప‌డిపోయింది. ఇక ప‌రిశ్ర‌మ‌లు స్థాపించాలంటే ముఖ్యంగా ఇత‌ర న‌గ‌రాల‌తో క‌నెక్టివిటీ ఉండాలి. ఇందు కోసం అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులూ అవ‌స‌ర‌ముంటాయి. అయితే ఇటీవ‌ల విశాఖ‌లో విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌వుతూ ఉండ‌టం ఐటీ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం చూపిస్తోంది. వీట‌న్నిటిని గ‌మ‌నించిన జ‌గ‌న్ స‌ర్కార్ ఐటీకి మ‌రింత ఊత‌మిచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇదే అంశాన్ని తాజాగా ఏపీ ఐటీశాఖ మంత్రి గౌత‌మ్‌రెడ్డి ప్ర‌స్తావించారు. గ‌త ప్ర‌భుత్వం అనువుకాని మంగ‌ళ‌గిరిలో ఐటీని ప్రోత్స‌హించి పెద్ద త‌ప్పు చేసింద‌న్నారు. త‌ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఐటీ ప‌రిశ్ర‌మ‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లాయ‌ని చెప్పారు. విశాఖప‌ట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి తమ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. 

భ‌విష్య‌త్తులో విశాఖ‌న‌గ‌రాన్ని ఐటీ రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఇలా జ‌గన్ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో పెద్ద పెద్ద ఐటీ సంస్థ‌లను విశాఖ‌లో నెల‌కొల్పే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని ఐటీ నిపుణులు చెబుతున్నారు. అలాగే విశాఖ‌ను ఐటీ రాజ‌ధానిని చేయ‌డంవ‌ల్ల నూత‌న ప‌రిశ్ర‌మ‌లే కాకుండా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు ఉత్సాహం చూపించే అవ‌కాశం ఉంది.  మౌలిక వ‌స‌తుల‌తోపాటు, రాయితీలు ఇస్తే విశాఖ‌లో ఐటీ ప‌రుగుల‌ను ఎవ్వ‌రూ ఆప‌లేరు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   an hour ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle