newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో సర్వే.. ఏం చెబుతోంది?

21-05-201921-05-2019 13:24:06 IST
Updated On 27-06-2019 12:55:31 ISTUpdated On 27-06-20192019-05-21T07:54:06.080Z21-05-2019 2019-05-21T07:22:06.854Z - 2019-06-27T07:25:31.981Z - 27-06-2019

ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో సర్వే.. ఏం చెబుతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోవడం కోసం జనం ఎగ్జిట్ పోల్స్‌ కోసం ఆసక్తి చూశారు. అనేక సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ముఖ్యంగా లగడపాటి సర్వేపై జనం ఆసక్తి చూపించారు. 2019 ఏపీ ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు పది సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ఫ్లాష్ సర్వే అభిప్రాయపడింది. జగన్ పార్టీకి ఏడు స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే అభిప్రాయపడింది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతారని పేర్కొంది. టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు రానుండగా.. వైఎస్ఆర్సీపీకి 40-42 శాతం ఓట్లు వస్తాయని, జనసేనకు 11 శాతానికి అటు ఇటుగా ఓట్లు పడే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ సర్వే అభిప్రాయపడింది. 

https://www.photojoiner.net/image/KEeuFhkJ

మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి 

* సీపీఎస్ సర్వే టీడీపీ: 43-44, వైసీపీ: 130-133, జనసేన: 0-1 

* వీడీపీ సర్వే టీడీపీ: 54-60, వైసీపీ: 111-121, జనసేన : 0-4 

* న్యూస్ 24- టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం టీడీపీ 17 (± 3), వైఎస్ఆర్సీపీ 8 17 (± 3) లోక్ సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 

* న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీ 10 నుంచి 12 చోట్ల, వైఎస్ఆర్సీపీ 13-14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 

* ఐఎన్ఎస్-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు, వైఎస్ఆర్సీపీ 11 లోక్‌సభ స్థానాలు వస్తాయి. 

మరోవైపు ఆర్ కె ఇమేజ్ గ్రూప్ కూడా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. మిర్రర్ టుడే మాసపత్రిక కోసం ఆర్ కె ఇమేజ్ గ్రూప్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సాధారణ గృ‌హిణులు, ఉద్యోగులు, యువత, వృత్తి విద్యా నిపుణులు, డ్వాక్రా గ్రూపులు, పెన్షనర్లు, వివిధ సామాజిక బృందాలను ఆర్ కె ఇమేజ్ సర్వే చేసింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించింది. శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వే కోసం 3లక్షల 92 వేలమందిని పైగా కలుసుకుంది. వీరిలో 80 శాతం డ్వాక్రా మహిళలే ఉన్నారు. 

ఆర్ కె ఇమేజ్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం శ్రీకాకుళంలో వైసీపీకి 6, టీడీపీకి 4 స్థానాలు, విజయనగరంలో వైసీపీకి 6, టీడీపీకి 3 సీట్లు, విశాఖపట్నంలో వైసీపీకి 7, టీడీపీకి 7, జనసేనకు 1 సీటు, తూర్పుగోదావరిలో వైసీపీకి 8-11, టీడీపీకి 8-11 మధ్య రావచ్చు. అలాగే పశ్చిమగోదావరిలో హోరాహోరీ పోరు జరిగింది. వైసీపీకి 7-8, టీడీపీకి 8 లేదా ఏడు సీట్లు దక్కవచ్చు. క‌ృష్ణా జిల్లాలో వైసీపీకి 9-11, టీడీపీకి 5నుంచి 7 సీట్లు, గుంటూరు జిల్లాలో  వైసీపీకి 7-8, టీడీపీకి 9నుంచి10 సీట్లు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి6-7, టీడీపీకి 5నుంచి 6 సీట్లు, నెల్లూరు జిల్లాలో వైసీపీకి 7-8, టీడీపీకి 2నుంచి3 సీట్లు, చిత్తూరు జిల్లాలో వైసీపీకి 8-10, టీడీపీకి 4 నుంచి 6 సీట్లు, కడప జిల్లాలో వైసీపీకి 9, టీడీపీకి 1 సీటు, అనంతపురం జిల్లాలో వైసీపీకి 5-6, టీడీపీకి 8నుంచి 9 సీట్లు, కర్నూలు జిల్లాలో వైసీపీకి 10-12, టీడీపీకి 2నుంచి4 సీట్లు వస్తాయని వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో వైసీపీకి 95 నుంచి109 సీట్లు, టీడీపీకి 66 నుంచి 78 సీట్లు దక్కవచ్చు. ఎన్నో ఆశలతో వచ్చిన జనసేన పార్టీకి ఈ సర్వేలో 1 సీటు దక్కవచ్చని పేర్కొంది.  ఇక ఎంపీ సీట్ల సంగతికి వస్తే ఆర్ కె ఇమేజ్ గ్రూప్ టీడీపీకి 7-9 సీట్లు, వైసీపీకి 16 నుంచి 18 సీట్లు, జనసేనకు 1 సీటు వస్తాయని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 41.2 శాతం నుంచి 43 శాతం, వైసీపీకి 44 నుంచి 45.8 శాతం , జనసేనకు 9 నుంచి 11 శాతం పోలవుతాయని ఆర్ కె ఇమేజ్ గ్రూప్ పేర్కొంది. ఇవన్నీ అత్యంత పకడ్బందీగా నిర్వహించిన సర్వే ఫలితాలని, అసలు ఫలితం అటు ఇటుగా ఉండొచ్చని సంస్థ ప్రతినిధి మధు కొండా పేర్కొన్నారు. జాతీయ సంస్థల సర్వేలకు ఈ సర్వే ఫలితాలకు మధ్య సారూప్యం కనిపిస్తోంది. 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   41 minutes ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   an hour ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle