newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏపీ ఎకానమీకి అడ్డంకిగా మారిన సంక్షేమం?

22-10-201922-10-2019 12:42:36 IST
Updated On 22-10-2019 12:52:44 ISTUpdated On 22-10-20192019-10-22T07:12:36.129Z22-10-2019 2019-10-22T07:09:26.575Z - 2019-10-22T07:22:44.035Z - 22-10-2019

ఏపీ ఎకానమీకి అడ్డంకిగా మారిన సంక్షేమం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆర్ధిక గణాంకాలు చెప్తున్నాయి. పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో కొత్త రాష్ట్రంగా మొదలుపెట్టిన గత ప్రభుత్వ పాలనలో ఒకపక్క అభివృద్ధి నినాదం మరోపక్క సంక్షేమంతో బ్యాంకుల నుండి.. బాండ్ల నుండి.. ప్రపంచ సంస్థల నుండి అప్పులు చేసి మరీ పరుగులు పెట్టించారు. అయితే ప్రస్తుతంలో ప్రభుత్వం మారగా సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. కారణాలేమైనా కానీ గత ప్రభుత్వం దారులు తెరిచిన అభివృద్ధికి ఈ ప్రభుత్వం బ్రేకులు వేసింది.

ఒకపక్క దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పట్టిపీడిస్తుంటే ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం విధానాలు కూడా అందుకు తోడై ఎకానమీ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని చెప్పుకోగల ఒక్కరంగం కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రాజెక్టులన్నిటిని అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇసుకపై తీసుకున్న విధానాలతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఇక దానికి అనుబంధ రంగాలు కూడా కోలుకోలేని స్థితిలో ఊగిసలాడుతున్నాయి.

నిర్మాణ రంగానికి అనుబంధాలైన ఇసుక, స్టీల్ వ్యాపారాలు మూతపడ్డాయి. నిర్మాణ రంగానికి అనుబంధంగా సాగే ట్రాన్స్ పోర్ట్, చిన్న తరహా పరిశ్రమలు అడుగు ముందుకేయలేకుంది. ఆ రంగంలో కూలీలు ఉపాధి కోల్పోయి కనీస ఆదాయానికి అందనంత దూరానికి వెళ్లిపోయారు. రాజధాని నిర్మాణాలపై లేని స్పష్టత కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పొరుగు రాష్ట్రాలకు వలసెళ్లిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఆరునెలలలో ప్రతి రంగంలో వృద్ధి రేటు అన్నది ఎక్కడా కనిపించడం లేదు.

ఇక రాష్ట్రంలో పరిస్థితులకు తగ్గట్లే నడిచే పర్యాటక రంగం డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. ఇంతకు ముందు విజయవాడ-గుంటూరు నగరాలతో పాటు విశాఖ పట్టణంలో హోటళ్లు పర్యాటకులు, ఇతర అవసరాల కోసం ఈ నగరాలకు వచ్చే జనాభాతో రద్దీగా ఉండేవి. అప్పుడు ఆ పరిస్థితి తగ్గట్లే పలు రెస్టారెంట్లు కూడా అర్ధరాత్రి వరకు అనుమతులు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. అన్ని ప్రముఖ హోటల్స్ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి.

కాగా రాష్ట్రంలో ఎకానమీకి.. అభివృద్ధికి తీవ్ర అడ్డంకిగా మారుతుంది సంక్షేమమే అనే భావన విశ్లేషకులలో కనిపిస్తుంది. దీనికి దేశ ఆర్ధిక తిరోగమనం పావలా వాటా ఉంటే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మరో డెబ్భై శాతం కారణంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమున్న ఆర్ధిక పరిస్థితిలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ఖర్చు చేసే స్థోమత లేదు. కనుకే ప్రభుత్వం సంక్షేమాన్ని ఎంచుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆయా పరిస్థితులలో చెప్పకనే చెప్పింది.

ఉదాహరణకు గత ప్రభుత్వం సింగపూర్ నుండి రాష్ట్రానికి విమాన సర్వీసుల కోసం పూర్తిస్థాయి టికెట్లు బుక్ కాని రోజుల్లో 25 శాతం సీట్ల ఖరీదును చంద్రబాబు ప్రభుత్వం చెల్లించి మరీ సర్వీసులు తిరిగేలా ఒప్పందం చేసుకుంది. ఇదే మాదిరి ఒక పట్టణం నుండి మరో పట్టణానికి కూడా కొన్ని ఒప్పందాలను చేసుకుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఒప్పందాలను కొనసాగించలేదు. విమాన సర్వీసులు-పేద తల్లుల సంక్షేమంలో మాకు రెండో అంశమే ముఖ్యమని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పేశారు.

ప్రస్తుతం ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం నుండి మరో నగరానికి విమాన సర్వీస్ అన్నది లేదు. ఉదాహరణకు గన్నవరం నుండి రేణిగుంట వెళ్లాలంటే చెన్నై వెళ్లి తిరిగి రేణిగుంట విమానం ఎక్కాలి. ఇక విశాఖకు వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి తిరిగి మళ్ళీ రాష్ట్రంలో మరో నగరానికి రావాలి. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అటు ఉత్తరాంధ్ర నుండి గోదావరి జిల్లాలలో పర్యాటకుల తాకిడి కనిపించేది. ఇప్పుడు ఎక్కడా పర్యాటకుల ఊసే లేదు. ఆ దిశగా ప్రభుత్వం ఆ రంగాన్ని పెంచే యోచన కూడా చేయనేలేదు.

ఇక పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం బడ్జెట్ లోనే అరకొర నిధులను కేటాయిస్తే ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నదానికి ఉదాహరణగా ఒక్క కొత్త పరిశ్రమతో ఒప్పందం చేసుకున్న దాఖలాలు లేవు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజలకు వచ్చే రెండేళ్లలో అందుబాటుగా ఉపయోగంలోకొచ్చే ఒక్క పథకం కూడా లేదు. అన్నీ ప్రస్తుతం అరచేతిలో అందించడమే. సంక్షేమ నిర్ణయాలు ప్రజలకు ప్రస్తుతానికి ఊరటనిస్తాయి. ప్రతి వ్యక్తికి ఏదొక విధంగా సంక్షేమం అందించడం మంచిదే కానీ ఆ వ్యక్తికి తిరిగి ఖర్చు చేస్తే స్థోమత కూడా కలిగిస్తేనే రాష్ట్రంలో దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుంది.

కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దాన్ని మరచి కేవలం సంక్షేమమే పరమావధిగా భావిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే చితికన ఆర్థికరంగం మరో ఆరునెలలు కొనసాగితే తిరిగి కోలుకోలేని దివాళాకు చేరడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సగటు వ్యక్తి ఆదాయం రోజురోజుకి పడిపోతూ ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదని సూటిగా చెప్తున్నారు. మరి మన ఓటు బ్యాంకు ఆధార ప్రభుత్వానికి ఆ మాట చెవికెక్కుతుందా? ఏమో చూద్దాం!

 

 

 

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

   12 hours ago


 అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

   13 hours ago


అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

   18 hours ago


మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

   19 hours ago


ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   21 hours ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   21 hours ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   a day ago


కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పరిస్థితిపై ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

   a day ago


గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

   a day ago


టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

టీటీడీపై ‌కుట్ర‌లా..?! మ‌రి ఆ కుట్ర‌ల‌ను చేధించ‌లేరా..?

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle