newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఏపీ ఇంటెలిజెన్స్ నయా బాస్.. విశ్వజిత్

31-03-201931-03-2019 10:02:01 IST
2019-03-31T04:32:01.418Z31-03-2019 2019-03-31T04:31:57.393Z - - 22-07-2019

ఏపీ ఇంటెలిజెన్స్ నయా బాస్.. విశ్వజిత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాల అనంతరం ఈసీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ పేరును ఖరారుచేసి, ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన విశ్వజిత్ ప్రస్తుతం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో వారిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఐబీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త చీఫ్ ఎంపికపై సీఎస్ అనిల్‌ చంద్ర పునేఠా ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. వీరిలో కుమార్‌ విశ్వజిత్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ ,నళినీ ప్రభాత్‌ ఏడీజీ ఆపరేషన్స్‌, కృపానంద త్రిపాఠి ఉజెలా హోంగార్డుల విభాగం ఏడీజీలు ఉన్నారు. 

ఈ ముగ్గురు నేతల పేర్లను పరిశీలించిన ఈసీ విశ్వజిత్‌ను డీజీగా ఎంపిక చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఇంటెలిజెన్స్ డీజీ వివాదం ముగిసినట్లయింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle