newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

ఏపీ ఆసుపత్రుల్లో అరాచకాలకు అడ్డుకట్ట..

04-08-202004-08-2020 08:43:05 IST
2020-08-04T03:13:05.430Z04-08-2020 2020-08-04T03:12:48.272Z - - 30-09-2020

ఏపీ ఆసుపత్రుల్లో అరాచకాలకు అడ్డుకట్ట..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు సత్వర వైద్య అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. ఇప్పటికే 104 కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. 

ప్రభుత్వం సమాచారం ప్రకారం ఏపీలో తొలుత 108 ఆస్పత్రుల్లో.. ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు,కలెక్టర్లకు సీసీ కెమెరా లింకులు కల్పించనున్నారు. వీరు, ఎప్పటికప్పుడు కోవిడ్‌ బాధితులకు చికిత్సపై నేరుగా పర్యవేక్షణ చేస్తారని, చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

సీసీ కెమెరాల ఏర్పాటు ఎలా?

రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది. ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు. బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు. 

ఐసీయూ, నాన్‌ ఐసీయూ, జనరల్‌ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు. కోవిడ్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా మందులు ఇస్తున్నారా భోజనం పెడుతున్నారా ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు. ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు.

డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులని, రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను డిస్‌ప్లే బోర్డులో ఉంచనున్నారు. ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్‌ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు.

సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. గత కొద్దినెలలుగా ప్రభుత్వాసుపత్రుల్లో చెప్పుకునే దిక్కులేక, సకాలంలో వైద్యసహాయం అందక ప్రాణాలు హరీ మంటున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్య కాస్తయనా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభావం చూపుతుందని ఆశస్తున్నారు.

 

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   12 minutes ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   2 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   2 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   2 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   2 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   2 hours ago


ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

   3 hours ago


దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

   4 hours ago


మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

   6 hours ago


స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

   6 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle