newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

13-10-201913-10-2019 13:16:31 IST
2019-10-13T07:46:31.815Z13-10-2019 2019-10-13T07:46:21.195Z - - 23-01-2020

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి వార్త పత్రికలు రకరకాల కథనాలును రాసుకొస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రంలో ఆదాయ వనరు అన్నది అధఃపాతాళంలోకి పడిపోయిందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోపక్క తాజాగా వెల్లడైన ఆదాయ పన్ను నివేదికలో కూడా ఏపీ దేశంలోనే మరే రాష్ట్రం కూడా అందుకోలేని పతనానికి పడిపోయింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుత వృద్ధి రేటు ఎలా ఉంది? గడించిన మూడునెలల పరిస్థితి ఏమిటని మనం ప్రభుత్వంలో ఏ మంత్రిని అడిగినా సూటిగా సమాధానమే రాదు. సాక్షాత్తు ఆర్ధిక మంత్రిని సైతం ఆ ప్రశ్న అడిగితే మాటలతోనే ఎదురుదాడి చేయడం జరిగిపోతుంది.

తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకొచ్చారు. అయితే ప్రజలలో ఉన్న అనుమానాలు, వెల్లువెత్తుతున్న సందేహాలకు మాత్రం ఒక్క వివరణ ఇవ్వలేదు. కనీసం మూడు నెలల గణాంకాలను చెప్పాలని కోరిన మీడియాపై తిరిగి ఎదురుదాడి చేశారు. గణాంకాలు చెప్పాలంటే దానికి ఎన్నో లెక్కలు కావాలని మీడియా మీద మండిపడ్డారు. ఏపీ ఆర్థికపరిస్థితి గురించి చెప్పడానికి మీడియా ముందుకొచ్చిన ఆయన మరికొన్ని కొత్త అనుమానాలను సృష్టించి వెళ్లారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి సాధారణంగానే ఉందన్న మంత్రి మెరుగు పడడానికి మాత్రం ఇప్పట్లో అవకాశాలు లేవని చెప్పకనే చెప్పారు.

స్టేట్ బ్యాంక్ రుణాలను అడిగితే తిరిగి ఆర్ధిక పరిస్థితి చూసుకున్నారా అని తిరిగి లేఖ రాయడం గురించి మీడియా అడిగినా అది అత్యంత కాన్ఫిడెన్షియల్ లేఖని, అసలు బ్యాంక్ లేఖ రాయడమే తప్పైతే ఆ లేఖ బయటకు రావడం దురదృష్టకరమని మంత్రి చెప్పడం విశేషం. వైసీపీ అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందన్నది కాదనలేని నిజం. గత ప్రభుత్వ హయాంలో పది శాతానికిపైగా వృద్ధిరేటుతో ఉంటే ఇప్పుడు మైనస్ వృద్ధిలోకి పోయిందన్న ప్రచారం బయట జరుగుతోంది. మరి దీనికి సమాధానం చెప్పమంటే మంత్రి లెక్కలు చూడాలంటున్నారు.

పైగా గత ప్రభుత్వం హయంలో చేసిన అప్పులను ఇప్పుడు చెల్లించాల్సి వస్తుందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైందని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే కొన్ని బ్యాంకులకు గత ప్రభుత్వం చేసిన అప్పులపై తమ పూచీ లేదని లేఖల ద్వారా సమాధానం కూడా ఇస్తున్నారు. మరి ఇప్పుడు కొత్త అప్పులు చేయరా అంటే అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందేనని మరోపక్క సమాధానం ఇస్తున్నారు. ఈ సమాధానాలతో అసలు ఆర్ధికపరంగా ప్రభుత్వం ఎంచుకున్న విధానం ఏంటన్నది ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఆదాయ మార్గంగా రాష్ట్రంలో చెప్పుకొనేందుకు ఒక్కటీ లేకపోయినా ఆదాయం పెరిగే మార్గం కనిపించకపోయినా ప్రభుత్వం మాత్రం ఖర్చులను పెంచుకుంటూనే పోతుంది. సంపద సృష్టి విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో ఆదాయార్జన మార్గాలు కుంచించుకుపోయాయని మేధావులు చెప్పుకొస్తున్నా బయటపడే మార్గాలను మాత్రం ప్రభుత్వం తీసుకురాలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే నిర్మాణం రంగంలో ఇసుక సరిపడా సరఫరాకు మరో మూడు నెలలు కష్టమేనని ప్రభుత్వం చేతులెత్తేసింది.

పారిశ్రామిక రంగంలో ప్రోత్సహాకాలకు, ప్రభుత్వం మీదున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఇప్పటి నుండి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. మరి అసలు ఇప్పటికీ ఆ ఊసేలేని ప్రభుత్వం ఈ గడ్డు పరిస్థితుల నుండి గట్టెక్కుతుందన్నది మేధావులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏ ధైర్యంతో ఇంకా ఖర్చులను పెంచుకుంటుందో.. సర్కార్ వద్ద ఉన్న ఆ మంత్రమేమిటోనని అర్ధంకాక ఆలోచిస్తున్నారు. 

Image result for AP economic

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle