newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళేనా?

01-06-201901-06-2019 13:43:14 IST
Updated On 25-06-2019 12:28:24 ISTUpdated On 25-06-20192019-06-01T08:13:14.198Z01-06-2019 2019-06-01T08:13:12.211Z - 2019-06-25T06:58:24.312Z - 25-06-2019

ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ కొలువు తీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రులు కొందరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినా, వివిధ కారణాల వల్ల ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.

ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ప్రకటించనున్నారు. ఈ కేబినెట్ కూర్పుపై తీవ్ర మంతనాలు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పేర్లను ఖరారు చేశారని అమరావతిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సమర్ధుడైన నాయకుడి కోసం వెతికిన జగన్మోహన్ రెడ్డి కోన రఘుపతిని ఎంపికచేశారని తెలుస్తోంది. బాపట్ల నుంచి గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే కోన రఘుపతి పేరు స్పీకర్ జాబితాలో బలంగా వినిపిస్తుంది. ప్రధానంగా ఆయన పేరే స్పీకర్ పదవి కి ఖరారైందని ప్రచారం జరుగుతోంది.

ఉన్నత విద్యా వంతుడు కావడం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందడం సౌమ్యుడిగా గుర్తింపుతో పాటు అసెంబ్లీ వ్యవహారాలపై పరిజ్ఞానం నేపథ్యంలో కోన రఘుపతి వైపు మొగ్గు చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ ఈ విషయంలో ఒక నిర్ణయానికొచ్చారని సమాచారం. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి కి స్పీకర్ గా అవకాశం కల్పించి.. ప్రకాశం జిల్లా నుంచి మరొకరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించనున్నారు. 

ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మహిళకు జగన్ అవకాశం ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పేరు వినిపిస్తోంది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ సీట్లో జరిగిన ఎన్నిక ఈసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె పార్టీ మారతారని ప్రచారం జరిగినా, జగన్ వెంటే ఆమె నడిచారు. అనూహ్యంగా విజయం సాధించారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తారని, భావించినా పోటీ నేపథ్యంలో ఆమెను డిప్యూటీ స్పీకర్‌ని చేయాలని జగన్ నిర్ణయించారు. బీఎస్సీ బీఇడి చదివిన పుష్ప శ్రీవాణి అతి చిన్న వయసులో డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. 

మరోవైపు చీఫ్ విప్‌గా సామినేని ఉదయభాను పేరు వినబడుతోంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని ఉదయభానుకి ఈ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవికి సామినేని ఉదయభానుని జగన్ ఎంపిక చేశారని చెబుతున్నారు.

ఎన్నికలు ముగిశాక ఉదయ భాను అనుచరులు ఖుషీ చేశారు. కాబోయే మంత్రి అంటూ ప్రచారం కూడా చేశారు. అయితే క‌ృష్ణాజిల్లా నుంచి మంత్రిపదవులు ఆశించేవారు ఎక్కువగా ఉండడంతో జగన్ ఉదయభానుని చీఫ్ విప్ చేయాలని భావించడంద్వారా పోటీని తగ్గించారు. మొత్తం మీద ఈ ముగ్గురి పేర్లూ అమరావతిలో హల్ చల్ చేస్తున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle