newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్షం?

14-11-201914-11-2019 10:12:42 IST
Updated On 14-11-2019 15:52:20 ISTUpdated On 14-11-20192019-11-14T04:42:42.159Z14-11-2019 2019-11-14T04:42:16.322Z - 2019-11-14T10:22:20.834Z - 14-11-2019

ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్షం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి, బీజేపీ రధసారధి అమిత్ షాలే. దశబ్దాల నాటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం.. అసంభవం అనుకున్నవాటిని చేసి చూపించడంలో ఇప్పుడు ఈ ఇద్దరూ ఆరితేరిపోయారు. కేంద్రంలో రెండోసారి విజయం తర్వాత వీరి చూపు మొండి వివాదాల పరిష్కారం, ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేని రాష్ట్రాలలో జెండా పాతడమే ధ్యేయంగా మార్చుకున్నట్లున్నారు.

ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు సెంటిమెంటల్ గా వేళ్ళూనుకుపోయిన దక్షణాదిలో కమల వికాసానికి మోడీ-షాల ధ్వయం ప్రత్యేక కసరత్తులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల కోసం ఓ స్పెషల్ టీం పనిచేస్తుండగా వీరి చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడినట్లుగా కనిపిస్తుంది. ఏకంగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్షాన్ని తయారుచేసేందుకు పావులు కదుపుతున్నట్లుగా కథనాలొస్తున్నాయి.

ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీని కోలుకోకుండా దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు చేసుకుంటుందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే టీడీపీలో కొందరు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనీ తాపత్రయపడుతుంది. కానీ కమలం లెజిస్లేచర్ పార్టీని సృష్టించి అసెంబ్లీలో మరో ప్రధాన ప్రతిపక్షం అయ్యేందుకు పావులు కదుపుతోందని ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది.

ఇందుకుగాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. టీడీపీలోని ఆ ఎమ్మెల్యేల బృందానికి ఉత్తరాంధ్ర టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు సారధ్యం వహిస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాల నుండి వినిపిస్తుంది. గంటా ఎల్పీ లీడర్ గా మరో ఏడుగురు సభ్యులతో శాసనసభాపక్షంగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

కేంద్రంలో టీడీపీ రాజ్యసభ సభ్యుల విషయంలో కూడా ఇదే జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ఘోర ఓటమి అనంతరం ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావు బీజేపీలో చేరారు. అప్పుడు ఆ వ్యవహారానికి సుజనా చౌదరి సారధ్యం వహించగా ముందుగా టీడీపీ నుండి బయటకి వచ్చిన నలుగురు ప్రత్యేక బృందంగా ప్రయత్నించి తర్వాత బీజేపీ గూటికి చేరిపోయారు.

ఇక ఇప్పుడు అదే మాదిరి ఏపీ అసెంబ్లీలో కూడా సీన్ రిపీట్ కానుందని తెలుస్తుంది. గంటా సారధ్యంలో ముఖ్యంగా కొందరు కాపు ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం ఎనిమిది మందితో లెజిస్లేచర్ పార్టీని సృష్టించనున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి టీడీపీకి రాజీనామా చేసి ఇంకా ఏ పార్టీలోకి దూకని వల్లభనేని వంశీ కూడా ఈ జాబితాలో ఉండే అవకాశాలున్నాయంటున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో స్నేహం అంటూనే రాష్ట్రంలో పార్టీని తొక్కేసే విధంగా పనులు చేస్తున్నారని.. కేంద్రం అండతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలనీ ఆరాటపడుతుండగా బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చేందుకు ఈ మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

పనిలో పనిగా కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకొని పవన్ కళ్యాణ్ ను కూడా దగ్గర చేసుకొని పార్టీకి సూపర్ బూస్ట్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బే కానుండగా అధికార వైసీపీ కేంద్రం-రాష్ట్రం అన్న తేడా లేకుండా కొత్త సవాల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. 

 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   9 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle