newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ఏపీలో 75 లక్షల మంది విద్యార్థులకు మేలుచేసే ప‌థ‌కం..!

10-10-201910-10-2019 08:48:14 IST
Updated On 10-10-2019 14:58:04 ISTUpdated On 10-10-20192019-10-10T03:18:14.444Z10-10-2019 2019-10-10T03:17:53.355Z - 2019-10-10T09:28:04.437Z - 10-10-2019

ఏపీలో 75 లక్షల మంది విద్యార్థులకు మేలుచేసే ప‌థ‌కం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వినూత్న ప‌థ‌కాల‌తో ప్రజాదార‌ణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో నూత‌న ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. అదే వైఎస్ఆర్ కంటి వెలుగు ప‌థకం.

అనంత‌పురంలో ఈ ప‌థ‌కాన్ని సీఎం జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.  ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ రాక సంద‌ర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసింది.

స్థానిక క‌ళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ కంటివెలుగును ప్రారంభించిన అనంత‌రం అక్కడే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్రసంగించ‌నున్నారు.

పాఠ‌శాల విద్యార్థుల‌తో ముఖాముఖిలో పాల్గొన‌నున్నారు సీఎం జ‌గ‌న్. మొత్తం ఆరు ద‌శ‌ల్లో ఈ ప‌థకాన్ని నిర్వహించ‌నున్నట్టు అధికారులు చెప్పారు. తొలి రెండు ద‌శ‌ల‌ను విద్యార్థుల‌కు ప‌రిమితం చేశారు.

రాష్ట్రంలో సుమారు 75 ల‌క్షల మందికిపైగా పాఠ‌శాల విద్యార్థులు ఉన్నట్టు ఓ అంచ‌నా. తొలి రెండు ద‌శ‌ల్లో భాగంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాల‌ల్లో ప్రస్తుతం 1 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థులంద‌రికీ కంటి ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. చివ‌రి నాలుగు ద‌శ‌ల్లో సామాన్య ప్రజ‌ల కోసం కంటివైద్య ప‌రీక్షా శిబిరాల‌ను నిర్వహిస్తారు.

అంధ‌త్వ నివారణ కింద 10వ నుంచి 16వ తేదీ వ‌ర‌కు ద‌శ‌ల వారీగా వారంద‌రికీ పాఠ‌శాల‌ల్లోనే కంటి ప‌రీక్షల‌ను చేప‌డ‌తారు. కంటిచూపులో లోపాలు ఉన్న విద్యార్థుల‌కు ఉచితంగా కంటి అద్దాల‌ను అంద‌జేయ‌నున్నట్టు తెలుస్తుంది.

రెండో ద‌శ‌లో సామాన్య ప్ర‌జ‌ల కోసం స్థానిక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం ప్ర‌భుత్వం రూ.560 కోట్ల‌ను ఇప్ప‌టికే కేటాయించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే మూడేళ్ల‌లో 2022 నాటికి రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ కంటి ప‌రీక్ష‌లు పూర్తి చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశం.

వైఎస్ఆర్ కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని జిల్లా వ్యాప్తంగా ప‌గ‌డ్బందీగా నిర్వ‌హించాల్సిన బాధ్య‌త‌ల‌ను జిల్లా, వైద్య‌, ఆరోగ్య అధికారుల‌కు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్. వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వైఎస్ఆర్ కంటి వెలుగు ప‌థ‌కం కొన‌సాగ‌నుంది. జిల్లా క‌లెక్ట‌ర్‌కు వారి తుది నివేదిక‌ను అంద‌జేయాల్సి ఉంటుంది. ఏదిఏమైనా సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ప‌లువురు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle