newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో 351.. తెలంగాణలో 269.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు

18-06-202018-06-2020 11:25:15 IST
Updated On 18-06-2020 11:38:50 ISTUpdated On 18-06-20202020-06-18T05:55:15.423Z18-06-2020 2020-06-18T05:55:13.054Z - 2020-06-18T06:08:50.083Z - 18-06-2020

ఏపీలో 351.. తెలంగాణలో 269.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రికార్డు సృష్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో దేశంలోనే రికార్డు సృష్టిస్తోన్న ఏపీలో బుధవారం ఒక్కరోజే 351 మంది వైరస్ బారిన పడగా, పరీక్షలు అతి తక్కువగా నిర్వహిస్తున్నందుకు న్యాయస్థానం విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో 269 కేసులు నమోదు కావడం విశేషం.

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 351మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని వారు 275మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది, విదేశాల నుంచి వచ్చిన 26మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో స్థానికంగా 5,555మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,253మంది, విదేశాల నుంచి  వచ్చిన 263మంది కరోనా బారినపడ్డారు. బుధవారం కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 90కి చేరింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 59కేసులు నమోదయ్యాయి.

ఆదోనిలో 27, కర్నూలు అర్బన్‌లో 17మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 49మంది, చిత్తూరు జిల్లాలో కొత్తగా 35మందికి వ్యాధి సోకింది. వీటిలో తిరుపతి నగరంలో 13, తిరుపతి రూరల్‌లో 3, నిండ్రలో 5, చంద్రగిరిలో 4, పీలేరులో 3, వెదురుకుప్పంలో 2చొప్పున ఉన్నాయి. కృష్ణాజిల్లాలో మరో 30మందికి వ్యాధి సోకింది. మచిలీపట్నం డివిజన్‌లో 13, నూజివీడు డివిజన్‌ల్లో 9 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 57కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మరో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. పార్వతీపురంలో ముగ్గురు పోలీసులకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కడప జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. చింతకొమ్మదిన్నెలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 27మందికి కొవిడ్‌-19 నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లా మందసకు చెందిన ఓ వ్యక్తి(45) కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. 15రోజుల కిందట తన వివాహ వేడుక జరుపుకునేందుకు శ్రీకాకుళం వెళ్లి వచ్చిన ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ మరణాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. 

కాగా, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డుకు దగ్గరలో ఉంది. ఆరు లక్షల మార్కుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,188 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,98,474కి చేరింది. ఈ నెల 11న 5 లక్షల మార్కు చేరిన వారంలోనే మరో లక్ష పరీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకి 11,207 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలుస్తోంది. 128 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,641కు చేరింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 90కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,340గా ఉంది.

ఒక్కరోజే తెలంగాణలో 269 కేసులు.. హైదరాబాద్‌లో భారీగా కరోనా కేసులు.. 

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 269 కరోనా పాజటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 214 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,675కు చేరింది. ఇందులో ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. 3,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో బుధవారం ఒకరు మృతి చెందా రు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 192కు చేరింది. తాజాగా 151 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3071 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2412 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

అనుమానితులు, లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తుండగా.. అందులో పావు వంతు నమూనాల్లో కరోనా పాజిటివ్‌ వస్తోంది. బుధవారం 1,096 నమూనాలు పరీక్షించగా.. అందులో 24.5 శాతం పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగించే విషయం. ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60.84 లక్షల నమూనాలు పరీక్షించగా, ఇందులో 3.54 లక్షల మందికి పాజిటివ్‌ వచ్చింది. దేశ సగటు 5.8 శాతంగా ఉంది. అయితే దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పాజిటివ్‌ వస్తున్న వాటి శాతం రెట్టింపుగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 45,911 నమూనాలు పరీక్షించగా, ఇందులో 5,675 మందికి పాజిటివ్‌ వచ్చింది. సగటున 12.3 శాతం నమూనాలకు పాజిటివ్‌ రావడం గమనార్హం.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గ్రేటర్‌ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉంది. తాజాగా బుధవారం కేసుల సంఖ్య డబుల్‌ సెంచరీ దాటింది. బుధవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 214 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బ న్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగామలో 5, సంగారెడ్డి, మెదక్‌లో 3, వనపర్తి, మేడ్చల్‌ లో 2, ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వికారాబాద్‌ జిల్లా ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. 

కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. తాజాగా రాష్ట్రంలో 5,675 కేసులు నమోదు కాగా, అందులో పురుషులు 3,671 (65 శాతం), మహిళలు 2,004 (35 శాతం) ఉన్నారు. వయసు రీత్యా పరిశీలిస్తే అత్యధికంగా 26–30 ఏళ్ల మధ్య వయసు వారే 679 మంది ఉన్నారు. కరోనా బారినపడి మరణించిన 192 మందిలో అత్యధికంగా 71 మంది మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవాళ్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 35 మంది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు ఉండటం గమనార్హం. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle