newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఏపీలో 24 గంటల్లో 36,047 కరోనా టెస్టులు.. 497 పాజిటివ్‌ కేసులు

25-06-202025-06-2020 14:44:26 IST
Updated On 25-06-2020 14:54:51 ISTUpdated On 25-06-20202020-06-25T09:14:26.699Z25-06-2020 2020-06-25T09:14:22.337Z - 2020-06-25T09:24:51.215Z - 25-06-2020

ఏపీలో 24 గంటల్లో 36,047 కరోనా టెస్టులు.. 497 పాజిటివ్‌ కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి రికార్డ్‌ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 

ఈ మేరకు బుధవారం  ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారిన పడి ఈ రోజు 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 129కు చేరింది. ఇప్పటివరకు 7,50,234  మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 4,779 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఏపీలో పాజిటివ్‌ శాతం 1.38కాగా, దేశంలో పాజిటివ్‌ శాతం 6.20గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

24 గంటల్లోపు 36,047 శాంపుల్ టెస్టులు చేయడం దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని పరిణామంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కర్నూలులో అత్యధికంగా 1,483 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కష్ణా 1,132 కేసులు, అనంతపూర్ 1028 కేసులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

కరోనా వైరస్‌ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle