newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఏపీలో 23 కొత్త కేసులు, 14 కు చేరిన మరణాలు.. గుంటూరు, కర్నూలు టాప్

16-04-202016-04-2020 08:55:02 IST
Updated On 16-04-2020 13:29:44 ISTUpdated On 16-04-20202020-04-16T03:25:02.732Z16-04-2020 2020-04-16T03:24:59.689Z - 2020-04-16T07:59:44.268Z - 16-04-2020

 ఏపీలో 23 కొత్త కేసులు, 14 కు చేరిన  మరణాలు.. గుంటూరు, కర్నూలు టాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే అత్యధికంగా హాట్ స్పాట్ జిల్లాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా నమోదైన ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఏపీలో కరోనా బారిన పడి ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో.. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకూ ఏపీలో 525 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా కర్నూలు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 4, కడప జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 

అయితే మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నమోదైన కేసులు లెక్కిస్తే 39 కేసులు పెరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. బుధవారం మాత్రమే నమోదైన కేసులు 23 అని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే మరో 23 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 525కు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో కర్నూలులో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపూరం జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 23 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కి పెరిగింది అని పేర్కొంది.

అలాగే రాష్ట్రంలో నమోదైన మొత్తం 525 పాజిటివ్ కేసులకు గాను 20 మంది డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 491 చేరుకుందని పేర్కొంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు.

అలాగే గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కేసులు పెరిగి 122కు చేరుకున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లా 110 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోనే 232 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 23 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కి పెరిగింది.

ఇప్పటికే ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను మినహాయిస్తే.. మిగిలిన 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం కరోనా హాట్‌స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది.

కరోనా వైరస్ నిర్ధారణ కోసం గుంటూరు జిల్లాలో ఒక్కరోజు 1,239 నమూనాలు సేకరించారు. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో అత్యదిక కేసులు నమోదవుతున్నందున వ్యాధి వ్యాప్తి నివారణకోసం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇకనుంచి రోజుకు రెండు వేల నమూనాలు సేకరించాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నారు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరికరాలను అదనంగా ఏర్పాటు చేశారు.

గుంటూరులో ప్రభుత్వ వైద్యశాలలో పీజీ వైద్య విద్యార్థినికి బుధవారం కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రి వర్గాల్లో కలకలం చెలరేగింది. విధుల్లో భాగంగా ఆమె ఇటీవలే కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స చేసినట్లు తెలిసింది. దీంతో ఆ వైద్యశాలలోని పది మంది వైద్యుల నమూనాలను ల్యాబ్‌కు పంపగా ఇప్పటికే ముగ్గురికి నెగటివ్ అని తేలింది. మరో ఆరుగురికి చెందిన ఫలితాలు గురువారం తెలిసే అవకాశముంది. ఆ వైద్య విద్యార్థిని ఉంటున్న వసతి గృహంలో ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్‌కి పంపారు.

 

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   9 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle