newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు. ఒకేరోజు 9276 మందికి పాజిటివ్

02-08-202002-08-2020 07:51:15 IST
2020-08-02T02:21:15.449Z02-08-2020 2020-08-02T02:20:56.739Z - - 03-08-2020

ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు. ఒకేరోజు 9276 మందికి పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,12,573కి చేరింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 9276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 58 మంది వైరస్ ‌బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,341కి చేరగా. మృతుల సంఖ్య 1407కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 12,750 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,614కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాలవారీగా చూస్తే  అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే కేసుల సంఖ్యలో జాతీయ స్థాయిలో మూడోస్థానానికి వచ్చిన ఏపీ ఇప్పుడు తమిళనాడుతో పోటీకి సిద్ధమవుతోంది. మరోవైపు 24 గంటలలోపు ఏపీలో  58మంది కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నంలలో 8మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, అనంతపురం, చిత్తూరు, కర్నూలుల్లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడపలో ఒక్కరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 1,407కు చేరాయి.

మరోవైపున  24గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 12,750మంది కోలుకున్నారు. ప్రతి జిల్లాలో 500మందికి పైగా డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ 76,614మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 0.94శాతం మంది మరణించారు. 72,188మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలులో 1,234, అనంతలో 1,128, విశాఖలో 1,155, తూర్పుగోదావరి జిల్లాలో 876, చిత్తూరులో 832, నెల్లూరులో 559, శ్రీకాకుళంలో 455, కృష్ణాజిల్లాలో 357 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

కేసులు పెరుగుతున్నా.. టెస్టులు తగ్గించని ఏపీ.. రాజ్‌దీప్ మరోసారి ప్రశంశలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా లెక్కలను ఏమాత్రం దాచలేదని అందుకే టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని ప్రముఖ జాతీయ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ప్రశంసించారు. కేసులు పెరుగుతున్నా.. ఏపీ సర్కార్‌ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయం అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వైరస్‌ కట్టడి కోసం ఏపీ అనుసరిస్తోన్న పద్దతి ప్రశంసనీయం అన్నారు. 

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా.. ఏపీలో కరోనా లెక్కలను దాచడంలేదన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలన్నారు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్‌ చేశారు. గతంలో ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించనప్పుడు కూడా రాజ్‌దీప్‌.. క్లిష్ట సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను తగ్గించడం లేదు. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 31 నాటికి రాష్ట్రంలో 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ముందంజలో ఉంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle