newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఏపీలో హై అలర్ట్..ఎందుకంటే..?

09-05-201909-05-2019 09:05:02 IST
Updated On 10-05-2019 14:12:39 ISTUpdated On 10-05-20192019-05-09T03:35:02.362Z09-05-2019 2019-05-09T03:33:59.230Z - 2019-05-10T08:42:39.281Z - 10-05-2019

ఏపీలో హై అలర్ట్..ఎందుకంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌  పోలీసులు అప్రమత్తం అయ్యారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అత్యవసర సమావేశం నిర్వహించడం, కోస్తాతీర ప్రాంత పోలీసులకు సూచనలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.  జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్‌, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. 

ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.  మరోవైపు ఎన్నికల కౌంటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు.

స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. నెల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్ని తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయన్న ఆయన... అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ప్రశ్నించాలని కొత్త ఆదేశాలు జారీచేశారు.ఆంధ్రప్రదేశ్‌కి తీర ప్రాంతం ఎక్కువ. ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ఏపీలోకి వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో... తీర ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. 

ప్రస్తుతం అధికారులంతా 24 గంటలూ అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. పై అధికారుల నుంచీ వాళ్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లూ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాద దాడుల కలకలం రేగడంతో... భద్రతను మరింత పెంచుతున్నారు. మొత్తం మీద కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి.

 

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle