newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఏపీలో సీబీఐకి ఎంట్రీ.. జగన్ కీలక నిర్ణయం

03-06-201903-06-2019 09:20:45 IST
Updated On 24-06-2019 17:13:28 ISTUpdated On 24-06-20192019-06-03T03:50:45.067Z03-06-2019 2019-06-03T03:50:06.328Z - 2019-06-24T11:43:28.373Z - 24-06-2019

ఏపీలో సీబీఐకి ఎంట్రీ.. జగన్ కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి జగన్ తిలోదకాలిచ్చారు. ఏపీలో సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలని జగన్ భావించారు. ఇన్నాళ్లు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఏపీలోకి రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఈ చట్టసవరణను జగన్ సర్కారు రద్దు చేయాలని నిర్ణయించింది.ఈ నిర్ణయంతో చంద్రబాబుకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. 

చంద్రబాబు హయాంలో సీబీఐ ఎంట్రీకి నో చెప్పారు. గతంలో కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్రం కక్ష సాధిస్తోందని రాష్ట్రాలు నిషేధిస్తుంటాయి. ఏపీతో పాటు పశ్చిమబెంగాల్ , కర్నాటక ఈ దారిలోనే నడిచాయి.

గత ఏడాది నవంబర్ లో సీబీఐకి కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎంట్రీ అనుమతుల్ని రద్దు చేసింది.గతంలో చంద్రబాబు జారీచేసిన  కొత్త జీవో : సీబీఐకి ‘నో ఎంట్రీ’అందువల్ల ఇకపై ఏపీ ప్రభుత్వం తనంతట తానుగా కోరిన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తు జరపగలదు. లేదా కోర్టు ఆదేశాలతో మాత్రమే ఏపీలో అడుగు పెట్టగలదు. సీబీఐ ద్వారా వ్యక్తుల్ని, నేతల్ని ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటి ఫలితంగా... గతంలో ఇచ్చిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను రద్దు చేస్తూ చంద్రబాబు హయాంలో ఉత్తర్వులు వెలువడ్డాయి.

మోడీతో బంధం తెగిపోయాక చంద్రబాబు సీబీఐకి ఏపీలో అనుమతి ఇవ్వలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతిని తీసేసి సీబీఐకి ద్వారాలు తెరిచారు. చంద్రబాబు నో ఎంట్రీ బోర్డుని జగన్ పీకేశారు. సీబీఐ ఇక ఏపీలో విచ్చలవిడిగా దాడులు చేయవచ్చు. కేసులు నమోదు చేయవచ్చు. ఈనిర్ణయం చంద్రబాబు అనుచరులకు కంటిమీద కునుకులేకుండా చేయవచ్చని అంటున్నారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle