newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

04-04-202004-04-2020 10:06:21 IST
Updated On 04-04-2020 10:12:34 ISTUpdated On 04-04-20202020-04-04T04:36:21.544Z04-04-2020 2020-04-04T04:36:13.969Z - 2020-04-04T04:42:34.408Z - 04-04-2020

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్  నివారణలో  భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఆర్థిక భరోసా వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. వివిధ జిల్లాల్లో ఉదయం ఆరుగంటలకే పంపిణీ ప్రారంభం అయింది. లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుండి స్వీయ నిర్బంధంలో ఉండి ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలపై ముఖ్యమంత్రి  వైఎస్.జగన్ అత్యంత మానవీయ కోనంతో ఆలోచించి నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన  ఆర్థిక భరోసా కార్యక్రమాన్ని వాలంటీర్లు అంకితభావంతో పంపిణీ చేస్తున్నారు.

బియ్యం కార్డులున్న వారికి ఇవాళ వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తున్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి వెయ్యి పంపిణీ చేస్తోంది సర్కార్. పింఛన్ల పంపిణీ తరహాలోనే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ కార్డుల నెంబర్ల ఆధారంగా వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తున్నారు. సుమారు కోటీ 30 లక్షల కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా ఇవాళ పంపిణీ చేయనుంది ప్రభుత్వం. నగదు పంపిణీ కోసం 1300 కోట్లు విడుదల చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నగదు పంపిణి నిర్వహిస్తున్నారు వాలంటీర్లు.

పేద కుటుంబాల పై మానవీయ కోణంతో 3విడతలుగా బియ్యం ,కందిపప్పు ఉచితంగా  ఇవ్వడం అంతేకాకుండా మా ఆర్థిక పరిస్థితులను ఆలోచించి మాకు ఆర్థిక భరోసా రూ:1000 ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వమే ఇంటివద్దకు నగదు పంపిణీ చేస్తోంది.

దీంతో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది.  ఒకవైపు లాక్ డౌన్, మరోవైపు పనులు లేకపోవడంతో కూలీలకు ఈ నగదు భరోసా ఇవ్వనుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ ప్రత్యేక సాయం అందాలని  ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. 

జిల్లాల వారీగా రూ.1000 పంపిణీ 

శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు

విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు 

విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు 

తూ.గో.జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు 

ప.గో.జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు 

కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు 

గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు 

ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు 

నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు 

చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు 

అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు 

కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు

వైఎస్ఆర్ జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle