newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఏపీలో వనజాక్షి... తెలంగాణలో అనిత. మహిళా అధికారులకు రక్షణేది?

01-07-201901-07-2019 14:50:12 IST
Updated On 03-07-2019 12:28:45 ISTUpdated On 03-07-20192019-07-01T09:20:12.116Z01-07-2019 2019-07-01T09:20:10.181Z - 2019-07-03T06:58:45.067Z - 03-07-2019

ఏపీలో వనజాక్షి... తెలంగాణలో అనిత. మహిళా అధికారులకు రక్షణేది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా అధికారులకు రక్షణ లేదా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఒక ఎమ్మార్వో, అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్ళిన మరో మహిళా అటవీ అధికారిపై అధికార పక్షనేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో మహిళా అధికారులకు పోలీసులు సైతం రక్షణ కల్పించకపోవడం శోచనీయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం ఏదైనా విధి నిర్వహణలో ఉన్న అధికారులను, వారి విధులు చేయనివ్వకుండా గాయాలు పాలుచేయడం.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణం అంటున్నారు. 

Image result for anitha forest officer

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆదివారం జరిగిన ఘటన తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కాళేశ్వరంలో అటవీ భూములు మునిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త ప్రాంతంలో చెట్లు నాటి మొక్కలు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా కాగజ్‌నగర్ ప్రాంతంలోని సార్సాలా అనే గ్రామంలో 20 హెక్టార్ల భూమిని ఎంపిక చేశారు అధికారులు. ఆ భూమిని చదును చేయడానికి ఆదివారం ఉదయం ట్రాక్టర్లతో వెళ్లారు. అదే సమయంలో స్థానికులు, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆ ప్రాంతానికి చేరుకుని సిబ్బంది వెనక్కి వెళ్లాలంటూ దాడికి దిగారు.

కర్రలతో సిబ్బందిని, అధికారులను కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ అనిత తీవ్రంగా గాయపడగా ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తమను బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా కర్రలతో దాడి చేసినట్టు మహిళా అధికారితో పాటు ఉద్యోగులు చెప్పారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అప్పటి వరకు తాము విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదంటున్నారు.  ఈఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. అటవీ శాఖ మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడిచేస్తున్నా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

కాగజ్‌నగర్‌ రూరల్ సీఐ వెంకటేష్‌, 15 మంది పోలీసులు ఉన్నా జీపుల నుంచి గ్రామస్థులను దించి, అటవీ అధికారులపై దాడులకు పాల్పడుతున్నా వీరంతా ప్రేక్షకుల్లా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ దాడికి పాల్పడింది అల్లాటప్పా నేత కాదు. కాగజ్‌నగర్‌ మండలం జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు. అధికారం అడ్డుపెట్టుకుని అధికారులపై దాడి చేయడం, దూషణలకు దిగడం వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి, కోనేరు కృష్ణారావుతోపాటు, ఆ గ్రామానికి చెందిన బూర పోశంను అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిపై 147, 148, 307, 353, 332, 427, ఆర్‌/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ దాడికి పాల్పడింది ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు ఎస్పీ. అటవీ అధికారులు చేపట్టే పనులకు పోలీసుల బందోబస్తును కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు కొన్నేళ్లుగా హక్కు పత్రాలు, పట్టాలుండి సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ అధికారులు లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొనడం విశేషం. మహిళా అధికారిపై దాడిని ప్రస్తావించకుండా,  రైతులు, గిరిజనులపై దాడికి నిరసనగా.. కాగజ్‌నగర్‌ మండలం జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోనేరు కృష్ణారావు తన రాజీనామా పత్రంలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. 

ఏపీలో వనజాక్షి స్టోరీ సేమ్ టు సేమ్

Image result for vanajakshi mro

ఇసుక అక్రమ వ్యవ‌హారాన్ని స‌మ‌ర్థంగా అడ్డుకునేందుకు ఏపీలో వ‌న‌జాక్షి అనే రెవెన్యూ అధికారి ప్రయ‌త్నించ‌టం.. ఆమెను స్థానిక ఎమ్మెల్యే బండ‌బూతులు తిట్టి.. జుట్టుప‌ట్టి లాగివేసిన ఘ‌ట‌న గురించి క‌థ‌లు.. క‌థ‌లుగా విన్నాం. ఈ ఘటన 2015 జూలైలో జరిగింది. అప్పటి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపారు. తన ఫోను కూడా లాక్కుని విసిరేశారన్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఎక్కువమంది ఉండడంతో అప్పుడు కూడా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించారు. 

ఏపీలో ఎమ్మెల్యే దురాగ‌తాల‌కు నిలువెత్తు రూపంగా రెవెన్యూ అధికారి వ‌న‌జాక్షిపై దాడి ఘటనను అప్పటి విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర‌చూ ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో అదే ప్రచారాస్త్రం అయింది. చంద్రబాబు ఐదేళ్ల పాల‌న‌లో మాయ‌ని మ‌చ్చగా  వ‌నజాక్షి ఉదంతం నిలిచిపోయింది.ఈ  వ్యవహారాన్ని అప్పటి సీఎం చంద్రబాబు లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణలో జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించడం కాస్త ఊరటగా చెప్పవచ్చు.

అటవీశాఖ అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ సీఎం కేసీఆర్...జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణపై సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై.. అందులోనూ మహిళపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద ఇద్దరు మహిళా అధికారులపై దాడి ఘటనలు రెండురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle