newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఏపీలో లాలూచీ రాజకీయం- వైకాపా అనుమానం నిజమేనా?

30-09-201930-09-2019 15:16:03 IST
2019-09-30T09:46:03.605Z30-09-2019 2019-09-30T09:45:20.050Z - - 15-12-2019

ఏపీలో లాలూచీ రాజకీయం- వైకాపా అనుమానం నిజమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ లాలూచీ రాజకీయం తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు లాలూచీ రాజకీయం చేస్తున్నాయని వైకాపా ఆరోపిస్తున్నది. కేవలం ఆరోపణలతో వదిలేయకుండా...కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఇందుకు ఆధారాలుగా చూపుతోంది. అయితే అసలు రెండు పార్టీలు లాలూచీ పడి రాజకీయం చేయడమేమిటన్న ప్రశ్నకు సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం కూడా ఇదే ఆరోపణ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంటుంది.

నాడు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ, అప్పటి విపక్షం వైకాపా విమర్శలు గుప్పించారు. విధానాల ఆధారంగా అధికార పార్టీ మీద  ఏ పార్టీ చేసే విమర్శలైనా ఒకే లాగ ఉంటాయి. అంత మాత్రాన రెండు పార్టీలూ లాలూచీ పడిపోయాయని అనుమానించడం ఎంత వరకూ సమంజసం అన్నది అధికారంలో ఉన్న పార్టీయే ఆలోచించాల్సి ఉంటుంది.

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విధానాలూ, నిర్ణయాలపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్న పార్టీలలో ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ...జనసేన ఉన్నాయి. ఎన్నికల ముందు నుంచీ జనసేన తెలుగుదేశం మౌత్ పీస్ అంటూ అప్పటి విపక్షం వైకాపా నిర్ధారించేసింది.  ఇప్పుడు   కొత్తగా తెలుగుదేశం మౌత్ పీస్ గా బీజేపీ వచ్చి చేరిందని అధికార వైకాపా ఆరోపణలు చేస్తున్నది.

పోలవరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇసుక విధానం ఇలా రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తరువాత వైకాపా తీసుకున్న కీలక నిర్ణయాలపై విపక్ష తెలుగుదేశం విమర్శలు చేస్తూ వస్తున్నది. అయితే ఇవే అంశాలను బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నది. అందుకే ఆ అంశాలపైనే బీజేపీ కూడా తన విమర్శలను గుప్పిస్తున్నది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే...తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కూడా పోలవరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇసుక దందాతో తెలుగుదేశం నేతలు కుబేరులౌతున్నారనీ విమర్శలు గుప్పించింది. అంతేనా అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనీ ఆరోపణలు గుప్పించింది.  

అయితే ఇప్పుడూ అప్పుడూ కూడా బీజేపీ ఆయా అంశాలలో అసలు అనుసరించాల్సిన విధానాలేమిటన్నది చెప్పడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం చేసిన సహాయం ఏమిటి, ఎటువంటి సహకారం అందించనుంది అన్న విషయాలు చెప్పలేదు. పోలవరం విషయంలో అప్పుడూ ఇప్పుడూ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నదే కానీ...జాతీయ ప్రాజెక్టుకు విడతల వారీగా అంగీకరించిన మేర నిధులు ఎందుకు విడుదల చేయడం లేదన్నది వివరణ ఇవ్వడం లేదు.

అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే పోలవరం ఏపీ సీఎంకు ఏటీఎంలా మారిపోయిందని విమర్శించారు. ఇప్పుడు సీఎంగా జగన్ రివర్స్ టెండరింగ్ అంటుంటే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల వ్యయం బాగా పెరిగిపోతుందంటూ బీజేపీ గగ్గోలు పెడుతున్నది. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇటువంటి విమర్శలతో విపక్షంతో అంటకాగుతున్నదన్న విమర్శలను ఎదుర్కొంది, ఎదుర్కొంటున్నది.

ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానమే అధికారంలో ఎవరు ఉన్నా విపక్షంతో లాలూచీ పడి రాజకీయాలు చేస్తున్నదన్న విమర్శలకు తావిస్తున్నాయనడంలో సందేహం లేదు.  కేంద్రంలో అధికారంలో ఉంది కనుక రాష్ట్రంలో విపక్షం బీజేపీ తమ పార్టీతో లాలూచీ పడిందన్న అధికార పక్షం విమర్శలను ఖండించదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమతో ఉందన్న భావన ప్రజలలో ఏర్పడటం వల్ల విపక్షానికి ఏదో మేరకు ప్రయోజనమే తప్ప నష్టం ఏమీ ఉండదు కనుక.

కానీ అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ విస్తరించడానికి, బలోపేతం కావడానికి బీజేపీకి ఇది కచ్చితంగా ప్రతిబంధ కమౌతుంది. ఇప్పటికే విభజన హామీలను నెరవేర్చడంలోనూ, విభజన నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించే విషయంలోనూ బీజేపీ సరైన రీతిలో స్పందించలేదన్న భావన ఏపీ ప్రజలలో ఉంది. విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు కర్మాగారం విషయంలో కానీ హామీ ఇచ్చి ఆ తరువాత మోసం చేసిందన్న అభిప్రాయం బలంగా ఉంది.

విశాఖ జోన్ ఇచ్చినట్టే ఇచ్చి...దానిని ఉపయోగం లేని విధంగా మార్చేసిందన్నవిమర్శ ఇప్పటికే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వైకాపా సర్కార్ నేరుగా బీజేపీ రాష్ట్రంలో విపక్ష తెలుగుదేశంతో లాలూచీ పడి రాజకీయం చేస్తున్నదన్న విమర్శ ను ఎదుర్కోవలసి రావడం బీజేపీ ఏ విధంగా చూసినా మంచిది కాదు. రాష్ట్రంలో ప్రభుత్వాలను బలహీనం చేయడమే ఏకైక ఎజెండాతో బీజేపీ పని చేస్తున్నదన్న అనుమానాలకు ఇది తావిస్తుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle